ఈ రోజు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(45) పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులను థ్రిల్ చేసేలా ”సర్కారు వారు పాట” మూవీ టీమ్. ఇటీవలే మహేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజు కానుకగా 27వ సినిమా టైటిల్ ‘సర్కారు వారి పాట టైటిల్’ని ప్రకటిస్తూ ప్రీ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇక తాజాగా ప్రిన్స్ బర్త్ డే స్పెషల్ సందర్భంగా ‘సర్కారు వారి పాట చిత్రం నుంచి మోషన్ పోస్టర్’ విడుదల చేసింది చిత్ర యూనిట్.
సరిగ్గా చెప్పిన సమయానికే మహేష్ అభిమానులను హుషారెత్తించే మోషన్ పోస్టర్‌ని మూవీ టీమ్ రిలీజ్ చేసింది. గతంలో లాగే మరోసారి రూపాయి బిళ్లతో మ్యాజిక్ చేస్తూ సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. సర్కారు వారి పాట సినిమాలోలో మహేష్ బాబు హీరోగా, కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది. అలాగే నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Hungama Shuru 💥 Here’s the electrifying Motion Poster of #SarkaruVaariPaata 🔔https://t.co/JBNOLYhBcn#HBDMaheshBabu
Super ⭐ @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @MythriOfficial @14ReelsPlus @GMBents
— GMB Entertainment (@GMBents) August 9, 2020
Read More:
విజయవాడ హోటల్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా
కరోనా బారిన పడ్డ మరో కేంద్ర మంత్రి