PM Modi-Putin Phone Call: ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్.. పెట్రోల్ సరఫరాతోపాటు అంతర్జాతీయ అంశాలపై చర్చ..

Modi-Putin Phone Call: పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఇది కాకుండా, చర్చల సందర్భంగా ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది.

PM Modi-Putin Phone Call: ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్.. పెట్రోల్ సరఫరాతోపాటు అంతర్జాతీయ అంశాలపై చర్చ..
Modi Putin Phone Call
Follow us

|

Updated on: Jul 01, 2022 | 5:42 PM

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక వాణిజ్యం అంశాలతోపాటు అనేక ఇతర ప్రపంచ సమస్యలపై చర్చించారు. అలాగే పుతిన్ భారతదేశ పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఇది కాకుండా, చర్చల సందర్భంగా ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. దౌత్యానికి అనుకూలంగా భారతదేశం దీర్ఘకాల వైఖరిని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. గత ఏడాది డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య అనాదిగా ఉన్న సంబంధాలను పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య తొలి ‘2+2’ మంత్రివర్గ చర్చలు జరిగాయి.

గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచం అనేక మౌలికమైన మార్పులను చూసిందని, వివిధ రకాల భౌగోళిక-రాజకీయ సమీకరణాలు ఉద్భవించాయని.. అయితే భారత్, రష్యా మధ్య స్నేహబంధం స్థిరంగా ఉందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. భారత్- రష్యా మధ్య ఉన్న సంబంధం నిజానికి అంతర్జాతీయ స్నేహానికి ఒక ప్రత్యేకమైన, విశ్వసనీయమైన నమూనా అని ప్రధాని మోదీ అభివర్ణించారు.

భారత పర్యటనలో వ్లాదిమిర్ పుతిన్ ఏం చెప్పారంటే..

భారత్ మంచి మిత్రదేశమని, భారత్ ప్రపంచ శక్తి అని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రెండు దేశాలు కలిసి భవిష్యత్తు వైపు చూస్తున్నాయన్నారు. భారతదేశాన్ని గొప్ప శక్తిగా, స్నేహపూర్వక దేశంగా చూస్తున్నాం తాము చూస్తున్నామన్నారు పుతిన్. మా రెండు దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. నేను భవిష్యత్తును చూస్తున్నాను. ఇంధన రంగం, ఆవిష్కరణలు, అంతరిక్షం, కరోనావైరస్ వ్యాక్సిన్లు, ఔషధాల ఉత్పత్తి వంటి రంగాలలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి రెండు దేశాలు భాగస్వాములుగా కొనసాగుతాయన్నారు వ్లాదిమిర్ పుతిన్.

జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం