పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర..అమల్లోకి కొత్త చట్టం

పార్లమెంట్​ ఉభయ సభల ఆమోదం పొందిన  పౌరసత్వ సవరణ బిల్లు(2019) కు  రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆమోదం లభించింది.  దీంతో సదరు బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫిసియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. పౌరసత్వ చట్టం ప్రకారం… పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్​ల నుంచి.. మతపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొని భారతదేశానికి వచ్చి శరణార్థులుగా నివశిస్తోన్న వారికి భారత సిటిజన్షిప్ లభించనుంది.  డిసెంబర్ 31, 2014 కి ముందు వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు,  జైనులు, […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:14 am, Fri, 13 December 19
పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర..అమల్లోకి కొత్త చట్టం

పార్లమెంట్​ ఉభయ సభల ఆమోదం పొందిన  పౌరసత్వ సవరణ బిల్లు(2019) కు  రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆమోదం లభించింది.  దీంతో సదరు బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫిసియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. పౌరసత్వ చట్టం ప్రకారం… పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్​ల నుంచి.. మతపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొని భారతదేశానికి వచ్చి శరణార్థులుగా నివశిస్తోన్న వారికి భారత సిటిజన్షిప్ లభించనుంది.  డిసెంబర్ 31, 2014 కి ముందు వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు,  జైనులు, బౌద్ధులు, పార్శీలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.

పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌సభలో సోమవారం, రాజ్యసభలో బుధవారం ఆమోదం పొందింది. గురువారం రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. కాగా బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అసోంలో చట్టాన్ని వ్యతిరేకిస్తూ  తీవ్ర స్థాయిలో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ బిల్లను తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ మద్దతు ప్రకటించగా, టీఆర్‌ఎస్ వ్యతిరేకించింది.