Donald Trump : జో బైడెన్​ ప్రమాణ స్వీకారానికి నేను రాను.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి తాను హాజరుకానని తేల్చి చెప్పారు  ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ఈనెల 20న ప్రమాణ...

Donald Trump : జో బైడెన్​ ప్రమాణ స్వీకారానికి నేను రాను.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం..
Follow us

|

Updated on: Jan 09, 2021 | 12:39 AM

Donald Trump : అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి తాను హాజరుకానని తేల్చి చెప్పారు  ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్​ ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరుకావడం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ట్వీట్ చేశారు. అండ్రూ జాన్సన్​ తర్వాత నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారానికి గైర్హాజరవుతున్న అగ్రరాజ్యం అధ్యక్షునిగా ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు​.

అధ్యక్షపదవి నుంచి తప్పుకునే ముందు చివరి గంటలు ఎలా గడుపుతారనే విషయంపై ఇప్పటివరకూ ట్రంప్​ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ఆయన ప్రణాళికలు ఎలా ఉన్నా జనవరి 20 మధ్యాహ్నం అగ్రరాజ్యం 46వ అధ్యక్షునిగా జో బైడెన్​ బాధ్యతలు చేపట్టనున్నారు.

తన పదవీ కాలం త్వరలోనే ముగుస్తుందని గురువారం వీడియో మెసెజ్ ను ట్రంప్ విడుదల చేశారు​. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బైడెన్​ పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

ఇవి కూడా చదవండి :