‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవానికి’ కౌంట్‌డౌన్..

తానా సంస్థ ఆధ్వర్యంలో జరగబోయే ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవానికి’ కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ తెలుగు పండగలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ‘తానా’ బృందం సమాయత్తమైంది. జూలై

‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవానికి’ కౌంట్‌డౌన్..

తానా సంస్థ ఆధ్వర్యంలో జరగబోయే ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవానికి’ కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ తెలుగు పండగలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ‘తానా’ బృందం సమాయత్తమైంది. జూలై 24,25,26 తేదీల్లో జరగబోయే ఈ భారీ ఆన్‌లైన్ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి ప్రారంభించనున్నారు. తానా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 12 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి వివరించారు.

‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలను పురస్కరించుకుని ఎన్నోదేశాలలో ఉంటున్న తెలుగువారి టాలెంట్‌ను వెలికితీసి, వారి మధ్య పోటీలను నిర్వహిస్తారు. కాగా, ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఈ పోటీలను జరుపనున్నట్లు తెలిపారు. ఇది తానా చరిత్రలోనే ఓ కొత్త అధ్యయంగా న్యూయార్క్ కో ఆర్డినేటర్ సుమంత్ రాంశెట్టి పేర్కొన్నారు.

తానా ఆధ్వర్యంలో జరుగుతున్న ‘ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాల్లో భాగంగా పాటల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొని పాటలు పాడాలనుకునే ఔత్సాహికుల కోసం ప్రత్యేకించి ఓ వాట్సాప్ గ్రూప్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు పాటల పోటీ కార్యక్రమం సమన్వయకర్త చల్లపల్లి శైలజ. పోటీలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడూ ఆ గ్రూప్‌లో అప్‌డేట్ చేస్తామని చెప్పారు.

ఇకపోతే, ఈ కార్యక్రమంలో 470 మంది జడ్జ్‌లు, 450 మంది వాలంటీర్లు కలిపి పనిచేస్తున్నట్లుగా తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి వెల్లడించారు. మొత్తం 300 జూమ్ యాప్ సెంటర్ల ద్వారా ఈ కార్యమాలన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇంకా సమయం ఉన్నందున్న ఈ వేడుకల్లో పాల్గొనదలచినవారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా సూచించారు.