ఇల్లు కొనాలనుకుంటున్నవారికి శుభ వార్త‌.. ఆ స్కీమ్ గ‌డువు పొడిగింపు

ఇల్లు క‌ట్టి చూడు..పెళ్లి చేసి చూడు..అంటారు పెద్ద‌లు. అంటే అవి రెండూ చాలా పెద్ద టాస్క్ లు అని అర్థం. అవును నిజ‌మే..ప్ర‌స్తుతం రియ‌ల్ ఎస్టేట్ రంగం డామినేట్ చేస్తున్న నేప‌థ్యంలో సామాన్యుడు ఇల్లు క‌ట్టుకోవ‌డం త‌ల‌కు మించిన భార‌మే.

ఇల్లు కొనాలనుకుంటున్నవారికి శుభ వార్త‌.. ఆ స్కీమ్ గ‌డువు పొడిగింపు
Follow us

|

Updated on: Jun 29, 2020 | 6:26 PM

ఇల్లు క‌ట్టి చూడు..పెళ్లి చేసి చూడు..అంటారు పెద్ద‌లు. అంటే అవి రెండూ చాలా పెద్ద టాస్క్ లు అని అర్థం. అవును నిజ‌మే..ప్ర‌స్తుతం రియ‌ల్ ఎస్టేట్ రంగం డామినేట్ చేస్తున్న నేప‌థ్యంలో సామాన్యుడు ఇల్లు క‌ట్టుకోవ‌డం త‌ల‌కు మించిన భార‌మే. ఈ నేప‌థ్యంలో దిగువ‌, మ‌థ్య త‌ర‌గ‌తి వ‌ర్గాలు సొంత గృహాలను కొనుగోలు చేసే స్థోమతను పెంచడానికి ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప‌థ‌కం స్టార్ట్ చేసింది. ఈ ప‌థ‌కం ద్వారా, దేశవ్యాప్తంగా 20 మిలియన్ ఇళ్ల‌ను నిర్మించాల‌నేది సంక‌ల్పం. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవ సంవత్సరం అయిన 31 మార్చి 2022, నాటికి ఈ టార్గెట్ కంప్లీట్ చెయ్యాల‌ని కేంద్ర భావిస్తోంది. అయితే ఈ స్కీమ్.. సబ్సిడీ లింక్ గృహ రుణ పథకం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పిఎంఎవై-ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన) ను ఒక ఏడాది పొడిగించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ను గ‌వ‌ర్న‌మెంట్ 2017 లో అమలు చేసింది. ఈ స్కీమ్ మార్చి 2021 వరకు పొందవచ్చు. ఈ పథకం యొక్క బెనిఫిట్ వార్షిక ఆదాయం 6-18 లక్షల మధ్య ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా కేంద్ర స‌ర్కార్ రూ .2.30 లక్షల రుణ రాయితీని అందిస్తుంది. ఈ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ప‌థ‌కం ద్వారా ఇప్పటివరకు 10 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ పథకం యొక్క ప్ర‌యోజనం ఎవ‌రికి..ఎలా వ‌ర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం.

ఈ పథకానికి ఎలా అప్లై చేయాలంటే…

బ్యాంకుల్లో హోమ్ లోన్ కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకున్న‌ప్పుడే గ‌వ‌ర్న‌మెంట్ సబ్సిడీ అందించే దరఖాస్తు కూడా తీసుకోండి. మీరు సబ్సిడీకి అర్హుత క‌లిగిఉంటే, మీ దరఖాస్తు సెంట్రల్ నోడల్ ఏజెన్సీకు పంపబడుతుంది. మీ దరఖాస్తుకు గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తే, నోడల్ ఏజెన్సీ సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకుకు అందజేస్తుంది. ఈ మొత్తం మీ బ్యాంక్ అకౌంటులో యాడ్ చేయ‌బ‌డుతుంది. ఇది మీ మొత్తం రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది.

ఉదాహరణగా చెప్పాలంటే, మీ సంవ‌త్స‌ర‌ ఆదాయం రూ .7 లక్షలు, రుణ మొత్తం రూ .9 లక్షలు ఉంటే, అప్పుడు సబ్సిడీ రూ .2.35 లక్షలు వ‌స్తుంది. హోమ్ లోన్ నుంచి ఈ రాయితీని తగ్గించినప్పుడు, మీ లోన్ మొత్తం రూ .6.65 లక్షలకు తగ్గుతుంది. 6 లక్షల వరకు సంవ‌త్స‌ర‌ ఆదాయం ఉన్నవారికి 2.67 లక్షలు 12 లక్షల వ‌ర‌కు ఇన క‌మ్ ఉన్నవారికి 2.35 లక్షలు 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి 2.30 లక్షలు త‌గ్గింపు ఉంటుంది.

ఆ త‌రువాత‌, మీరు ఈ త‌గ్గిన మొత్తాన్ని వాయిదాల ప‌ద్ద‌తిలో చెల్లించాలి. సబ్సిడీ ప్రయోజనాన్ని పొందడానికి లోన్ మొత్తం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, మీరు ప్ర‌జంట్ రేటుకు అదనపు మొత్తానికి ఇంట్ర‌స్ట్ చెల్లించాలి.