వేశం మార్చుకున్న కరోనా..మరింత వేగం పెంచిందంటున్న బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు వేషం మార్చుకుంది. ఇప్పటికే బ్రిటన్,ఆస్ట్రేలియా దేశాలను వణికిస్తున్న మహమ్మారి ఇప్పడు దక్షిణాఫ్రికా, నైజీరియాలకు పాకింది. దీంతో ఆయా దేశాలకు రాకపోకలను ప్రపంచ దేశాలు..

  • Sanjay Kasula
  • Publish Date - 7:31 pm, Thu, 24 December 20
వేశం మార్చుకున్న కరోనా..మరింత వేగం పెంచిందంటున్న బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు వేషం మార్చుకుంది. ఇప్పటికే బ్రిటన్,ఆస్ట్రేలియా దేశాలను వణికిస్తున్న మహమ్మారి ఇప్పడు దక్షిణాఫ్రికా, నైజీరియాలకు పాకింది. దీంతో ఆయా దేశాలకు రాకపోకలను ప్రపంచ దేశాలు నిలిపివేశాయి. అయితే యూకే, సౌతాఫ్రికాల్లో కనిపిస్తున్న లక్షణాలకు భిన్నంగా నైజీరియాలోని బాధితుల్లో కనిపిస్తున్నాయని అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించారు.

దీని గురించి ఇప్పుడే చెప్పలేమని ప్రకటించారు. నైజీరియాలోని ఓసున్ రాష్ట్రంలో ఇద్దరు కరోనా రోగుల నుంచి ఈ ఏడాది ఆగస్టు, అక్టోబర్ నెలల్లో సేకరించిన నమూనాల్లో వైరస్‌ జన్యుమార్పిడిని గుర్తించినట్లుగా వారు పేర్కొన్నారు.

ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో జన్యుమార్పిడి వైరస్ కేసులు బయటపడిన సంగతి తెలిసింది. కానీ బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉండటంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆ దేశం నుంచి నడుస్తున్న విమాన సర్వీసులను వెంటనే నిలిపివేశాయి.

ఇదిలావుంటే.. సౌతాఫ్రికా నుంచి లండన్ వచ్చిన ఇద్దరిలో మరో రకం వైరస్ లక్షణాలు ఉన్నాయని వారు వెల్లడించారు. బ్రిటన్‌లో వెలుగుచూసిన వైరస్‌ను మించిన వేగంతో వ్యాపించే లక్షణం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వైరస్‌కు ఉన్నాయని బ్రిటన్ ఆరోగ్య ఆరోగ్య మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.