Postal Charges: పోస్టాఫీసుల్లో కనీస బ్యాలెన్స్‌ ఛార్జీలు తగ్గింపు.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్థిక శాఖ

Postal Minimum Balance Charges: పోస్టాఫీసు కస్టమర్లకు కేంద్ర ఆర్థిక శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎన్నో చర్యలు చేపడుతోంది...

Postal Charges: పోస్టాఫీసుల్లో కనీస బ్యాలెన్స్‌ ఛార్జీలు తగ్గింపు.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్థిక శాఖ
Postal Charges
Follow us

|

Updated on: Apr 20, 2021 | 5:08 PM

Postal Minimum Balance Charges: పోస్టాఫీసు కస్టమర్లకు కేంద్ర ఆర్థిక శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎన్నో చర్యలు చేపడుతోంది. కనీస బ్యాలెన్స్‌ ఛార్జీలను తగ్గిస్తూ పోస్టల్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. పోస్టల్‌ సేవింగ్స్‌ ఖాతాలపై ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అయితే మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలను సగానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. పోస్టాఫీసు మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలు రూ.50 కి తగ్గాయి. గతంలో పోస్టల్‌ మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలు రూ. వందగా ఉండేవి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

పోస్టల్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ స్కీమ్‌ 2019కు సవరణలు చేయడం ద్వరా ఛార్జీలను తగ్గిస్తున్నామని ఆర్థిక శాఖ తెలిపింది. కాగా, నిబంధనల నేపథ్యంలో పోస్టాఫీసులో సేవింగ్స్‌ అకౌంట్‌ ఉన్న వారు తప్పనిసరిగా రూ.500 కనీస బ్యాలెన్స్‌ ఉంచాల్సిందే. ఒక వేళ ఈ బ్యాలెన్స్‌ లేనిపక్షంలో ఛార్జీలు భరించాల్సి ఉంటుంది.

అయితే గతంలో రూ.100 ఉన్న కనీస బ్యాలెన్స్‌ ఛార్జీలు.. ఇప్పుడు రూ.50కు తగ్గాయి. ఇకపోతే దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం ఎటువంటి మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలనూ విధించకపోవడం గమనార్హం. గతంలో వసూలు చేసినప్పటికీ, గత ఏడాది మార్చి నుంచి వీటిని తొలగించింది.

కాగా, ఈ మధ్య కాలంలో పోస్టల్‌ శాఖలో కూడా అనేక స్కీ్‌మ్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. డబ్బులను సేవింగ్‌ చేసుకునేందుకు రకరకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం. పోస్టల్‌ శాఖ ప్రవేశపెట్టే స్కీమ్‌ల వల్ల చాలా మంది పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరుస్తూ పథకాలను అందిపుచ్చుకుంటున్నారు.

ఇవీ చదవండి: SBI Zero Balance: ఎస్‌బీఐ జీరో బ్యాలెన్స్‌ సేవింగ్స్‌ ఖాతా వడ్డీ రేట్లు.. ఉచిత లావాదేవీలు, ఇతర పూర్తి వివరాలు

Fixed Deposit: బ్యాంకులు ఎఫ్‌డీలపై విధించే టీడీఎస్‌ను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి…?

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..