మ‌ర్డ‌ర్ కేసులో పాముకు శవపరీక్షలు..ఏం తేలిందంటే..!

కేరళ కొల్లాంలో ‘పాము స్కెచ్’​తో భార్యను హత్య చేసిన ఉదంతం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు ద‌ర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. మ‌ర్డ‌ర్ కోసం ఉపయోగించిన పామును బ‌య‌ట‌కు తీసి శవపరీక్ష చేశారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది నిందితుడి ఇంటికి వెళ్లి పాము కళేబరాన్ని పాతిపెట్టిన ప్లేస్ గుర్తించి జాగ్రత్తగా తవ్వి బయటకు తీశారు. పాము కాటు వల్లే ఉత్రా ప్రాణాలు విడిచింద‌నే విషయం శవపరీక్షల్లో వెల్ల‌డైంద‌ని అధికారులు వెల్లడించారు. దాదాపు 152 […]

మ‌ర్డ‌ర్ కేసులో పాముకు శవపరీక్షలు..ఏం తేలిందంటే..!
Follow us

|

Updated on: May 27, 2020 | 8:23 PM

కేరళ కొల్లాంలో ‘పాము స్కెచ్’​తో భార్యను హత్య చేసిన ఉదంతం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసు ద‌ర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు. మ‌ర్డ‌ర్ కోసం ఉపయోగించిన పామును బ‌య‌ట‌కు తీసి శవపరీక్ష చేశారు. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది నిందితుడి ఇంటికి వెళ్లి పాము కళేబరాన్ని పాతిపెట్టిన ప్లేస్ గుర్తించి జాగ్రత్తగా తవ్వి బయటకు తీశారు.

పాము కాటు వల్లే ఉత్రా ప్రాణాలు విడిచింద‌నే విషయం శవపరీక్షల్లో వెల్ల‌డైంద‌ని అధికారులు వెల్లడించారు. దాదాపు 152 సెంటిమీట‌ర్ల‌ పొడవైన పాము ఇప్పటికే కుళ్లిపోయే ద‌శ‌లో ఉంద‌ని, అయితే శవపరీక్షకు అవసరమైన శాంపిల్స్ తీసుకోగలిగినట్లు పేర్కొన్నారు. పాము కోరలను సైతం నమూనాల కోసం తీసుకున్నట్లు వెల్ల‌డించారు. ఫోరెన్సిక్ టీమ్ సేకరించిన శాంపిల్స్ తదుపరి టెస్టుల‌ కోసం పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. తుది ఫలితాలను కోర్టుకు సమర్పించనున్నట్లు వివ‌రించారు. హత్య కేసులో ఇంకెవరి పాత్ర అయినా ఉందా? అనే విషయంపై విచార‌ణ చేస్తున్న‌ట్టు వెల్లడించారు.

రెండో పెళ్లి చేసుకోవాలన్న దుర్బుద్దితోనే తన భార్య ఉత్రాను పాముతో కరిపించి హత్య చేశాడు సూరజ్. యూట్యూబ్​లో పాముల ద్వారా ఎలా మ‌నుషుల‌ను చంపొచ్చో తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం ఈ మ‌ర్డ‌ర్ చేశాడు. హత్యకు ఉపయోగించిన పామును ఓ కంటైనర్​లో దాచి ఇంటి పెరట్లో పాతిపెట్టాడు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు