తారక్ ఎనర్జీ నెక్ట్స్ లెవల్, బుట్టబొమ్మ కవరింగ్ ప్లాన్, ఆడియన్స్ కూల్ అవుతారా?

సౌత్ ఆడియన్స్.. బొడ్డూ... నడుమే చూస్తారంటూ హాట్ కామెంట్స్ చేసిన పూజ.. వెంటనే నాలుక్కరుచుకున్నారు. అమ్మడి కామెంట్స్‌ కు..

తారక్ ఎనర్జీ నెక్ట్స్ లెవల్, బుట్టబొమ్మ కవరింగ్ ప్లాన్, ఆడియన్స్ కూల్ అవుతారా?

సౌత్ ఆడియన్స్.. బొడ్డూ… నడుమే చూస్తారంటూ హాట్ కామెంట్స్ చేసిన పూజ.. వెంటనే నాలుక్కరుచుకున్నారు. అమ్మడి కామెంట్స్‌ కు గట్టిగా కౌంటర్లు పడుతుండటంతో ఇప్పుడు ఆడియన్స్‌ను కూల్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. అందుకే… అవకాశం వచ్చిన ప్రతిసారి ఏదో ఒకరకంగా టాలీవుడ్ జనాలను తన వైపు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నారు జిగేలు రాణి.

ఎవరు పలకరించినా… టాలీవుడ్‌ హీరోలను, మేకర్స్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు పూజ. తాజాగా ఎన్టీఆర్‌ ఈజ్‌ బెస్ట్‌ అంటూ సర్టిఫికేట్‌ ఇచ్చేశారు బుట్టబొమ్మ. అరవింద సమేత మూవీ తన లైఫ్ టైం ఎక్స్‌పీరియన్స్ అనటమే కాదు… తారక్‌తో వర్క్ చేయటం సూపర్బ్ అంటూ నందమూరి అభిమానులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఊరికే ఎన్టీఆర్‌ను పొగిడేస్తే పూజా హెగ్డే ఎలా అవుతారు చెప్పండి. అందుకే తారక్‌తో పాటు తనకు తానే ఓ సర్టిఫికేట్ ఇచ్చేసుకున్నారు.. ‘మా ఇద్దరికీ ఎనర్జీ లెవల్స్‌ ఎక్కువ. అందుకే స్క్రీన్ మీద మా జోడి సూపర్బ్‌గా వర్క్ అవుట్ అయ్యింది’ అని తన సొంత డబ్బాకు కూడా పని చెప్పారు. మరి గోపికమ్మ మాటలతో తెలుగు ఆడియన్స్ కూల్ అవుతారా..? చూద్దాం.

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్

Click on your DTH Provider to Add TV9 Telugu