TDP Leader Murder: టీడీపీ నేత నందం సుబ్బయ్యను మేమే హత్య చేశాం.. పోలీస్ స్టేషన్‌‌లో లొంగిపోయిన ముగ్గురు నిందితులు..

TDP Leader Murder: కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను దారుణంగా హతమార్చిన కేసులో ముగ్గురు నిందితులు పోలీసుల..

TDP Leader Murder: టీడీపీ నేత నందం సుబ్బయ్యను మేమే హత్య చేశాం.. పోలీస్ స్టేషన్‌‌లో లొంగిపోయిన ముగ్గురు నిందితులు..
Follow us

|

Updated on: Dec 30, 2020 | 2:12 PM

TDP Leader Murder: కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను దారుణంగా హతమార్చిన కేసులో ముగ్గురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. నందం సుబ్బయ్యను తామే చంపామంటూ కుండా రవి, అనిల్, బెనర్జీ బుధవారం నాడు పోలీసుల ముందు సరెండర్ అయ్యారు. కాగా, సుబ్బయ్య హత్య కేసులో ఆయన భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుండా రవి పేరు కూడా ప్రస్తావించింది. మరోవైపు కుండా రవి హత్య చేసి ఉంటాడని మంగళవారం నాడు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండగా, తన భర్తను హత్య చేయించింది ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డే అని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించింది. ఆమేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన బామ్మర్ది మునిరెడ్డి, కుండా రవిలే హత్య చేయించారని అపరాజిత తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు ఇంతవరకూ ఇవ్వలేని అపరాజిత ఆరోపించింది. తన భర్తపై కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారని, అదంతా పచ్చి అబద్ధం అని కొట్టిపారేశారు. తన భర్త సుబ్బయ్యపై ఉన్న రేప్ కేసును కోర్టు కొట్టివేసిందని ఆమె గుర్తు చేశారు. అంతేకాదు, తన భర్తపై పెట్టిన కేసులన్నీ ఎమ్మెల్యే రాచల్లు పెట్టించినవే అని అపరాజితి ఆరోపించింది. రాజకీయంగా ఎదుగుతున్నాడని, ఎమ్మెల్యే, అతని బామ్మర్ది చేస్తున్న అరాచకాలను బయట పెడుతున్నాడన్న కారణంగానే తన భర్తను హత్య చేయించారని ఆరోపించింది. ఫిర్యాదు చేసి రోజు గడుస్తున్న పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. హత్య జరిగిన తర్వాత తన భర్త మొబైల్‌ను కనిపించకుండా చేశారని, మొబైల్ ఉంటే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పింది.

Also read:

Clashes in Tadipatri: తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు.. మొదలైన అరెస్టుల పర్వం.. తొలి అరెస్ట్ వారి నుంచే..

Vijayawada Mumbai Flight: జనవరి 12 నుంచి విజయవాడ-ముంబై మధ్య ‘ఇండిగో’ విమాన సర్వీసులు..