వాహనదారులకు అలెర్ట్.. సైడ్ వ్యూ మిర్రర్స్ లేకున్నా జరిమానా..

ఇక వాహనంతో రోడ్డెక్కేటప్పుడు హెల్మెట్‌, ఆర్సీ, కారు అయితే సీటుబెల్ట్‌, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ చూసుకోవడమే కాదు… సైడ్‌ మిర్రర్స్‌ (అద్దాలు) ఉన్నాయా..? లేవా..? అని కూడా చూసుకోండి. ఎందుకంటే అవి లేకపోయినా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కేవలం మూడు నెలల్లోనే ఈ తరహా కేసులు 27,709 నమోదు చేశారు. రూ. 29,30,715 (ఈ చలానా) జరిమానా రూపంలో విధించారు. కాగా.. ఈ విషయమై ట్రాఫిక్‌ […]

వాహనదారులకు అలెర్ట్.. సైడ్ వ్యూ మిర్రర్స్ లేకున్నా జరిమానా..
Follow us

| Edited By:

Updated on: Apr 16, 2020 | 12:10 PM

ఇక వాహనంతో రోడ్డెక్కేటప్పుడు హెల్మెట్‌, ఆర్సీ, కారు అయితే సీటుబెల్ట్‌, ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ చూసుకోవడమే కాదు… సైడ్‌ మిర్రర్స్‌ (అద్దాలు) ఉన్నాయా..? లేవా..? అని కూడా చూసుకోండి. ఎందుకంటే అవి లేకపోయినా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కేవలం మూడు నెలల్లోనే ఈ తరహా కేసులు 27,709 నమోదు చేశారు. రూ. 29,30,715 (ఈ చలానా) జరిమానా రూపంలో విధించారు.

కాగా.. ఈ విషయమై ట్రాఫిక్‌ పోలీసులను సంప్రదించగా మో టార్‌ వెహికిల్‌ యాక్టు 1988, జీవో 108/2011 (ట్రాన్స్‌పోర్టు, రోడ్‌ అండ్‌ బిల్డింగ్స్‌) జరిమానాలు విధిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో వాహనదారులు అవాక్కవుతున్నారు. సైడ్‌ మిర్రర్‌ లేకపోయినా పోలీసులు జరిమానాలు విధిస్తున్నారని తెలియదని వాహనదారులు వాపోతున్నారు. అవగాహన కల్పించకుండా జరిమానాలు విధించడం తగదని విమర్శిస్తున్నారు.

Also Read: కరోనా కాలంలో క్యాప్ జెమినీ ఇండియా సంచలన నిర్ణయం