జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేయనున్నారు తుళ్లూరు పోలీసులు. రాజధాని పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, సెక్షన్ 144, 30 యాక్ట్‌ని బ్రేక్ చేసినందుకు పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.
మంగళవారం అమరావతిలో పర్యటన సందర్భంగా.. పవన్ మందడానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడికి ఆయన్ని అనుమతించలేదు పోలీసులు. సచివాలయంలో సీఎం జగన్ ఉన్నందున.. మందడానికి పవన్ వెళ్లేందుకు.. పోలీసులు నిరాకరించారు. తుళ్లూరు వెళ్లాలని పవన్‌కు సూచించారు. దీంతో.. పవన్ కారు దిగి మందడానికి నడుచుకుంటూ వెళ్లారు.
అయితే.. మందడం వైపు నడుచుకుని వెళ్తోన్న పవన్‌ను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సీఎం కాన్వాయ్ వెళ్తున్నందున పావు గంట పాదయాత్ర ఆపాలని పవన్‌ను కోరారు. దీంతో వెంకటాపాలెం వద్ద రోడ్డుపై బైటాయించారు పవన్. మరోసారి మందడం శివార్లలో పవన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో.. జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.