మతిస్థిమితం లేని వ్యక్తికి పోలీస్ కానిస్టేబుల్ సేవలు

మతిస్థిమితం లేని వ్యక్తికి పోలీస్ కానిస్టేబుల్ సేవలు

మతిస్థిమితం లేని వ్యక్తి ని చిరాకుగా చూసేవారు ఉండే రోజులలో దగ్గరికి తీసుకొని స్వయంగా బట్టలు తొడిగిన సపర్యలు చేశాడు ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి అర్బన్ జిల్లాలో శ్రీకాళహస్తి పట్టణంలోచోటుచేసుకుంది.

Balaraju Goud

|

Aug 12, 2020 | 1:51 PM

మతిస్థిమితం లేని వ్యక్తి ని చిరాకుగా చూసేవారు ఉండే రోజులలో దగ్గరికి తీసుకొని స్వయంగా బట్టలు తొడిగిన సపర్యలు చేశాడు ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

కరోనా మహమ్మారి విజృంభణతో మానవత్వం మంట కలసి పోతున్నవేళ అపద్బంధవుడయ్యాడు ఓ పోలీసు. ఎక్కడైన ఏదైన ప్రమాదం జరిగితే పట్టించుకునే నాథుడే కరువవుతున్నారు. తోటివారికి సాయం చేద్దామన్న సంగతి దేవుడెరుగు.. కనీసం దగ్గరకి వెళ్ళడానికి భయంతో వెనక్కు తగ్గుతున్నారు. ఇలాంటి సమయంలో ఆ పోలీసు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తికి సపర్యలు చేసి శభాష్ అనిపించుకున్నాడు. కరోనా కష్ట కాలంలో పోలీసులు తమ ప్రాణాలును లెక్కచేయకుండా తమ కుటుంబాలు సైతం ప్రక్కన పెట్టి ప్రజలను రక్షించడమే పరమావధిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటన తిరుపతి అర్బన్ జిల్లాలో శ్రీకాళహస్తి పట్టణంలో చోటుచేసుకుంది.

శ్రీ కాళహస్తి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిదిలోని సాయి బాబా గుడి ప్రక్కన మతిస్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి అర్ధనగ్నంగా వీధుల్లో తిరుతున్నాడు. గత కొద్దిరోజులుగా వీధుల్లో తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతన్ని చూసిన స్తానికులెవరు పట్టించుకోలేదు. అయితే, శ్రీకాళహాస్తి హైవే మొబైల్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ ముందుకు వచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అటుగా వెళుతున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ ఆ మతిస్థిమితం లేని వ్యక్తిని చూసి తన మనస్సు కలచి వేయడంతో వెంటనే అతనికి బట్టలు ఇప్పించడమే కాక ఆహారాన్ని కూడా అందించాడు. కాగా, మతిస్థిమితం లేని వ్యక్తి బట్టలు వేసుకోవడానికి ససేమిరా ఒప్పుకోకపోవడంతో అతని బుజ్జగించి అతనికి స్వయంగా దుస్తులు తొడిగి మరి అతనికి తినడానికి ఆహారాని ఇప్పించాడు. ఇలా ఓ అనాథకు సేవ చేసి తన మానవత్వాన్ని చాటుకుని పలువురికి శ్రీధర్ ఆదర్శంగా నిలిచాడు. హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ చేసిన పనికి స్థానికులు ప్రశంసలతో ముంచెత్తారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu