బ్రేకింగ్: నారా లోకేష్ మళ్లీ అరెస్ట్!

మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్‌ని మరో మారు అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ వైపు వస్తోన్న లోకేష్, కళా వెంకట్రావును కాజా టోల్‌ గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఒంగోలు నుంచి వస్తోన్న ఆయన.. బెంజ్ సర్కిల్‌ వద్ద పిలుపునిచ్చిన పాదయాత్రకు వెళ్తారేమోనన్న కారణంతో లోకేష్‌ను టోల్‌గేట్ వద్దే అడ్డుకున్నారు పోలీసులు. అయితే కారు దిగి పోలీసుల తీరుపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. తాను పార్టీ ఆఫీసుకు వెళ్తానని, రోజూ ఇలా అడ్డుకోవడం […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:20 pm, Fri, 10 January 20
బ్రేకింగ్: నారా లోకేష్ మళ్లీ అరెస్ట్!

మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్‌ని మరో మారు అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడ వైపు వస్తోన్న లోకేష్, కళా వెంకట్రావును కాజా టోల్‌ గేట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ఒంగోలు నుంచి వస్తోన్న ఆయన.. బెంజ్ సర్కిల్‌ వద్ద పిలుపునిచ్చిన పాదయాత్రకు వెళ్తారేమోనన్న కారణంతో లోకేష్‌ను టోల్‌గేట్ వద్దే అడ్డుకున్నారు పోలీసులు. అయితే కారు దిగి పోలీసుల తీరుపై లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. తాను పార్టీ ఆఫీసుకు వెళ్తానని, రోజూ ఇలా అడ్డుకోవడం సరికాదని లోకేష్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో.. పోలీసులకు, లోకేష్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో.. లోకేష్‌, కళా వెంకట్రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.