ఈ “మాస్క్‌ కోడి” ఆచూకీ తెలిస్తే చెప్పండి.. ఎందుకంటే దీనిపై ఓ కేసు ఉందట..!

ఎవరైనా దొంగల ఫోటోలో.. లేక తప్పిపోయిన వారి ఫోటోలో.. ఇంకా కొన్ని సందర్భాల్లో పెంపుడు కుక్కల ఫోటోలనో పలు సందర్భాల్లో పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. పలు కేసుల విషయంలో ప్రజల సాయం కోసం అలా చేస్తుంటారు. అయితే లూసియాన పోలీసులు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎందుకంటే వారు ఓ కోడి ఆచూకీ కావాలంటూ పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. లూసియాన సమీపంలోని ఓ ఏటీఎం […]

ఈ మాస్క్‌ కోడి ఆచూకీ తెలిస్తే చెప్పండి.. ఎందుకంటే దీనిపై ఓ కేసు ఉందట..!
TV9 Telugu Digital Desk

| Edited By:

May 05, 2020 | 4:49 PM

ఎవరైనా దొంగల ఫోటోలో.. లేక తప్పిపోయిన వారి ఫోటోలో.. ఇంకా కొన్ని సందర్భాల్లో పెంపుడు కుక్కల ఫోటోలనో పలు సందర్భాల్లో పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. పలు కేసుల విషయంలో ప్రజల సాయం కోసం అలా చేస్తుంటారు. అయితే లూసియాన పోలీసులు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎందుకంటే వారు ఓ కోడి ఆచూకీ కావాలంటూ పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. లూసియాన సమీపంలోని ఓ ఏటీఎం వద్దకు వెళ్లిన వారిపై.. ఓ కోడి దాడికి దిగుతుందట. అంతేకాదు.. అటు రోడ్లపై కార్లలో వెళ్తున్న వారిపై కూడా దాడికి దిగుతూ.. కారులోపలికి చొరబడేందుకు యత్నిస్తుందట. ఈ కోడి చేస్తున్న దాడిపై స్థానికులు వాల్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో సదరు కోడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు.. కోడి ఆచూకీ తెలపాలంటూ వాల్కర్ పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కోడికి సంబంధించిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్క్‌తో ఉన్న కోడి ఫొటోను పోస్టు చేసిన పోలీసులు.. గత కొద్ది రోజులుగా ఈ కోడి లూసియాన బ్యాంక్‌ ఏటీవం వద్దకు వస్తున్న వారిపై దాడి చేస్తోందని.. అంతేకాకుండా.. రోడ్లపై వెళ్తున్నవారిపై కూడా దాడి చేస్తోందని.. కార్లలో వెళ్తున్న వారిపై కూడా దాడికి దిగుతూ కారు లోనికి వెళ్లేందుకు యత్నిస్తోందని.. దీనిపై బాధితులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కోడికి సబంధించిన జాడ తెలిస్తే వెంటనే తమకు సమాచారంఅందించాలంటూ పోలీసులు పోస్ట్‌లో రాశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu