తమిళనాడుపై పట్టుకోసం ప్రధాని కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజం

తమిళనాడుపై పట్టుకోసం ప్రధాని మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

  • Umakanth Rao
  • Publish Date - 9:02 pm, Sat, 23 January 21
తమిళనాడుపై పట్టుకోసం ప్రధాని కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజం

తమిళనాడుపై పట్టుకోసం ప్రధాని మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ తమిళనాడు భాష, సంస్కృతి, చరిత్ర గురించి ఆయనకు ఏమీ తెలియదని, కానీ దర్యాప్తు సంస్థల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని రాహుల్ అన్నారు. శనివారం కోయంబత్తూరులో రోడ్ షో నిర్వహించిన ఆయన.. తన గ్రాండ్ మదర్ కి,  తన తండ్రికి ఎంతో ప్రేమాభిమానాలను అందించిన ఈ రాష్ట్ర ఋణం తీర్చుకోలేనన్నారు. తమిళ ప్రజల హాక్కులపై పోరాటం కోసం తానిక్కడికి వచ్చానని రాహుల్ చెప్పారు. ఈ రాష్ట్రంలో మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన పలుమార్లు తమిళనాడును విజిట్ చేస్తున్నారు. ఇటీవలే మదురైలో జల్లికట్టును కూడా చూసి,, ఈ రాష్ట్ర భాష, సంస్కృతి, చరిత్ర ను ప్రస్తావించారు.