PM Modi: ఈ నెల 20న బౌద్ధ తీర్థయాత్ర స్థలం కుశీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..

PM Narendra Modi: అక్టోబర్ 20 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు . ముఖ్యంగా కుశీనగర్..

PM Modi: ఈ నెల 20న బౌద్ధ తీర్థయాత్ర స్థలం కుశీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
Pm Modi
Follow us

|

Updated on: Oct 17, 2021 | 4:50 PM

PM Narendra Modi: అక్టోబర్ 20 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కుశీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు . ముఖ్యంగా కుశీనగర్ గౌతమ బుద్ధుడు మహా పరి నిర్వాణం పొందిన ప్రదేశం ..బౌద్ధ తీర్థయాత్ర స్థలంగా ఖ్యాతిగాంచింది. ఈ వినాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలో వివిధ దేశాల రాయబారులు పాల్గొంటారు. శ్రీలంక నుండి ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం కూడా వేడుకల్లో పాల్గొనడానికి రానున్నది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.

‘అతిథి దేవో భవ’కు అనుగుణంగా, విదేశీ అతిథుల ఘన స్వాగతం కోసం అవసరమైన సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షా సమావేశంలో, అన్ని సన్నాహాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా చేయడానికి అన్ని తగిన విధంగా ఏర్పట్లు ఉండేలా చూడాలని చెప్పారు. ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఏర్పట్లు చేయాలని.. పరిశుభ్రత పాటించాలని.. వేడుకను విజయవంతం చేయడానికి అధికారులందరూ కృషి చేయాలని సీఎం యోగీ చెప్పారు.

ఇక మరోవైపు ఇదే నెలలో మరోసారి ప్రధాని మోడీ ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్ 25 న సిద్ధార్థనగర్ జిల్లా నుంచి ఏడు జిల్లాల్లోని ఏడు మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే.. అది రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు కానుంది. ఈవెంట్‌కు సంబంధించిన అన్ని సన్నాహాలు సకాలంలో పూర్తి చేయడానికి కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read:  పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీకి సై అంటున్న దత్తన్న వారసురాలు.. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతానంటున్న విజయలక్ష్మి