తొలి తెలుగు 24 గంటల న్యూస్ ఛానల్‌గా టీవీ9 ప్రారంభమైంది. 24 గంటలు వార్తలు ప్రసారం చేయడం సాధ్యమా? అన్నారు కొందరు. అందరి అంచనాలను పటాపంచలు చేసింది టీవీ9. వార్తలు ఇలా కూడా ప్రసారం చేయవచ్చా అని ప్రశ్నించిన మీడియాలోని ఉద్ధండపిండాలను కూడా నివ్వెరపోయేలా చేసింది టీవీ9.
“ప్రజా పక్షమే నా సంకల్పం… మెరుగైన సమాజమే నా లక్ష్యం” అంటూ ప్రజలకు టీవీ9 ధైర్యాన్నిచ్చింది. ఇప్పుడు హిందీలో భారత్‌వర్ష్ పేరుతో మరో విప్లవానికి నాంది పలికింది. రవి ప్రకాష్ ఆధ్వర్యంలో విప్లవాన్ని తీసుకొచ్చింది టీవీ9. రవి డైనమిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.’న్యూస్ అంటే టీవీ9… టీవీ9 అంటే న్యూస్’ ఇది ప్రజల మాట అన్నంతగా ప్రాచుర్యం పొందింది.
జాతీయ చానెల్స్ కు ధీటుగా టీవీ9 నెట్వర్క్ విస్తరించింది. తెలుగుతో పాటు కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో టీవీ9 నెట్వర్క్ సత్తా చాటుతోంది. ఇప్పుడు హిందీలో భారత్‌వర్ష్ పేరుతో మరో ఛానల్ ఏర్పాటైంది. ఈ ఛానల్ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు అరుణ్ జైట్లీ మరియు ఇతర జాతీయ నేతలు హాజరయ్యారు.