మరో భారీ ప్రాజెక్టుకు ప్రధాని శ్రీకారం.. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను ప్రారంభించనున్న మోదీ

దేశంలో మరో భారీ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. ఆత్మ నిర్బర భారత్ పథకంలో భాగంగా స్వదేశీ పరిజ్జానంతో రూపొందుతున్న పరిశ్రమలను ప్రధాని ప్రోత్సహిస్తున్నారు.

మరో భారీ ప్రాజెక్టుకు ప్రధాని శ్రీకారం.. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను ప్రారంభించనున్న మోదీ
Follow us

|

Updated on: Dec 29, 2020 | 8:08 AM

PM Modi to inaugurate EDFC: దేశంలో మరో భారీ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. ఆత్మ నిర్బర భారత్ పథకంలో భాగంగా స్వదేశీ పరిజ్జానంతో రూపొందుతున్న పరిశ్రమలను ప్రధాని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈడీఎఫ్‌సీ) లోని న్యూ భౌపూర్-న్యూ ఖుర్జా విభాగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు కారిడార్‌కు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభోత్సవం చేస్తారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటలో తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లోని ఈడీఎఫ్‌సీలోని భౌపూర్‌-ఖుర్జా భాగాన్ని రూ.5,750 కోట్ల వ్యయంతో 351 కిలోమీటర్ల కారిడార్‌ను నిర్మించారు. అనంతరం ప్రయాగ్‌రాజ్‌లోని ఈడీఎఫ్‌సీ కార్యాకలాపాల నియంత్రణ కేంద్రాన్ని సైతం ప్రారంభించనున్నారు. కొత్తగా నిర్మించే కారిడార్‌ స్థానిక పరిశ్రమలకు వివిధ అవకాశాలను కల్పించబోతోంది. కొత్త ఈడీఎఫ్‌సీ విభాగం కాన్పూర్-ఢిల్లీ ప్రధాన లైన్‌ను డీకంజెస్టింగ్ చేయడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

కాగా, ఈడీఎఫ్‌సీ కారిడార్ మొత్తం దూరం1,856 కిలోమీటర్లు. ఇది పంజాబ్‌లోని లూధియానా సమీపంలోని సహనేవాల్ నుండి ప్రారంభమై హర్యానా, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల గుండా పశ్చిమ బెంగాల్‌లోని డంకుని వద్ద ముగుస్తుంది. భారతీయ రైల్వేలు వేగంగా రైళ్లు నడిపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త 351 కిలోమీటర్ల పొడవైన కారిడార్‌ నిర్మాణంతో ఔరాయ జిల్లాలోని పాడి పరిశ్రమ, పుఖ్రాయన్ జిల్లాలోని అల్యూమినియం తయారీ పరిశ్రమలు ప్రయోజనం పొందనున్నాయి. కొత్త భూపుర్‌- న్యూ ఖుర్జా విభాగం కూడా హత్రాస్‌లో హింగ్ ఉత్పత్తి, బులంద్‌ షహర్ జిల్లాలోని ఖుర్జా కుండల ఉత్పత్తులు, ఫిరోజాబాద్ గ్లాస్ వేర్ పరిశ్రమ, అలీఘర్ తాళాలు, హార్డ్‌వేర్‌ పరిశ్రమ, ఎటావా జిల్లా వస్త్ర ఉత్పత్తిదారులు, బ్లాక్ ప్రింటర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని అధికారులు తెలిపారు. అలాగే, ఉత్తర ప్రదేశ్‌లోని దాద్రిని ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ నౌకాశ్రయానికి అనుసంధానించే వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కూడా డిఎఫ్‌సిసిఎల్ నిర్మిస్తోంది. 1,504 రూట్ కిమీ దూరం ఉండే ఈ కారిడార్ హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల గుండా వెళుతుంది.

భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.