Bank Account: ఆ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో రూ.5.5 లక్షలు వేసింది ప్రధాని మోదీనేనట.. అసలు ట్వీస్ట్‌ ఏంటంటే..!

Bank Account: ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో రూ.5.5 లక్షలు వచ్చి చేరడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి..

Bank Account: ఆ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో రూ.5.5 లక్షలు వేసింది ప్రధాని మోదీనేనట.. అసలు ట్వీస్ట్‌ ఏంటంటే..!
Follow us

|

Updated on: Sep 17, 2021 | 1:09 PM

Bank Account: ఓ వ్యక్తి బ్యాంకు అకౌంట్లో రూ.5.5 లక్షలు వచ్చి చేరడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారు. ఇప్పుడు నా అకౌంట్లో మోదీ మొదటి విడత కింద రూ.5.5 లక్షలు వేశాడని సదరు వ్యక్తి చెప్పడం ఆశ్యర్యం కలిగిస్తోంది. మోడీ డబ్బులు వేయడం ఏంటని అనుకుంటున్నారా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అసలు ట్వీట్‌ అదిరిపోయేలా ఉంది. అదేంటో చదవండి.

బీహార్‌లోని ఖగారియా జిల్లా మన్సి పోలీసు స్టేషన్‌ పరిధిలో భక్తియార్‌ గ్రామానికి చెందిన దాస్‌ అనే వ్యక్తి బ్యాంక్ ఖాతాలోకి రూ.5.5 లక్షలు జమ అయ్యాయి. అతను మోదీనే ఈ డబ్బులు వేశాడని భావించాడు. అందుకే ఆ డబ్బులు మొత్తం అవసరాలకు ఉపయోగించుకున్నాడు. అసలు విషయం ఏంటంటే ఆ డబ్బులు వేసింది మోదీ కాదు.. బ్యాంకు సిబ్బంది పొరపాటు వల్ల అతడి ఖాతాకు వచ్చి చేరాయి.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. పొరపాటున ఆ వ్యక్తి ఖాతాలో పడ్డ డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని బ్యాంకు సిబ్బంది ఆ వ్యక్తిని కోరారు. అయితే ఆ డబ్బులు మోదీ వేశాడని.. అన్ని ఖర్చు అయిపోయాయని, ఆ డబ్బులు పూర్తిగా అయిపోవడం వల్ల తిరిగి ఇవ్వలేను అని అతను చెప్పుకొచ్చాడు. ఇక బ్యాంకు మేనేజర్‌ సత్యనారాయణ ప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిపై ఐపీసీ సెక్షన్‌ 406 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని  అరెస్టు చేసిన పోలీసులు.. విచారణ చేపడుతున్నారు. ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాను పరిశీలించగా, మూడు దఫాలుగా ఆ డబ్బులను విత్‌డ్రా చేశాడని, తిరిగి ఆ డబ్బులను ఇవ్వాలని నోటీసులు పంపి చెప్పినా.. తిరిగి ఇవ్వనని అంటున్నాడని బ్యాంకు మేనేజర్‌ తెలిపారు. మోదీ ఎన్నికల సమయంలో అందరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పాడని, తనకు మొదటి విడతగా రూ.5.5 లక్షలు వేశారని సదరు వ్యక్తి చెప్పడంతో బ్యాంకు అధికారులు, పోలీసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇవీ కూడా చదవండి: Farmers: రైతులందరికీ ఈ పథకం మరో వరం లాంటిది.. రూ.16 లక్షల కోట్లు టార్గెట్‌ పెట్టుకున్న మోడీ ప్రభుత్వం..!

JEE Mains Scam: జేఈఈ మెయిన్‌లో అవకతవకలు.. 20 మంది విద్యార్థుల‌ను డిబార్ చేసిన ఎన్‌టీఏ