ఆ బిల్లులను ఆమోదించకండి, రాష్ట్రపతికి అకాలీదళ్ అభ్యర్థన

వ్యవసాయ బిల్లులపై సంతకం చేయరాదని అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కోరారు. రైతులకు అండగా నిలవాలని, లేని పక్షంలో వారు మిమ్మల్ని క్షమించబోరని అన్నారు. రైతుల పట్ల తాను..

  • Umakanth Rao
  • Publish Date - 5:29 pm, Sun, 20 September 20
ఆ బిల్లులను ఆమోదించకండి, రాష్ట్రపతికి అకాలీదళ్ అభ్యర్థన

వ్యవసాయ బిల్లులపై సంతకం చేయరాదని అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కోరారు. రైతులకు అండగా నిలవాలని, లేని పక్షంలో వారు మిమ్మల్ని క్షమించబోరని అన్నారు. రైతుల పట్ల తాను ఈ అభ్యర్థన చేస్తున్నానని, కోట్లాది అన్నదాతలను వీధులపాలు చేయవద్దని ఆయన కోరారు. ఈ బిల్లులను పార్లమెంటుకు తిప్పి పంపాలని విజ్ఞప్తి చేశారు.  ఈ బిల్లులపై అకాలీదళ్ మొదట బీజేపీకి మద్దతునిచ్చినప్పటికీ ఆ తరువాత వ్యతిరేకించింది. పైగా బీజేపీతో తన సంబంధాలపై పునరాలోచనలో పడింది.