Phone Charging: రాత్రుల్లో మీ ఫోన్‌ను ఎందుకు ఛార్జింగ్‌ పెట్టకూడదు.. టెక్‌ నిపుణులేమంటున్నారు..!

Phone Charging: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోయింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. అయితే ఫోన్‌ల వినియోగించే..

Phone Charging: రాత్రుల్లో మీ ఫోన్‌ను ఎందుకు ఛార్జింగ్‌ పెట్టకూడదు.. టెక్‌ నిపుణులేమంటున్నారు..!
Phone Charging
Follow us

|

Updated on: Aug 16, 2022 | 3:43 PM

Phone Charging: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిపోయింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. అయితే ఫోన్‌ల వినియోగించే విధానం గురించి కొన్ని చిట్కాలు తెలిసి ఉండాలి. వాటిపై అవగాహన ఉంటే ఫోన్‌ ఎక్కువ రోజుల సర్వీస్‌ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ముఖ్యంగా బ్యాటరీ. మనం ఎంత ఎక్కువగా ఫోన్‌ను వాడుతుంటే అంత త్వరగా బ్యాటరీ అయిపోతుంటుంది. మళ్లీ మళ్లీ ఛార్జింగ్‌ పెట్టాల్సి వస్తుంటుంది. ఇక ఛార్జింగ్‌ విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే బ్యాటరీ కాలపరిమితి ఎక్కువగా వస్తుంటుంది. సాధ్యమైనంత ఎక్కువ కాలం బ్యాటరీ జీవితాన్ని పొందడానికి ప్రయత్నించాలి.

ఒక ఐఫోన్‌ 20 వాట్స్‌ ఛార్జర్‌ను ఉపయోగించి 30 నిమిషాలలో సున్నా నుంచి 50 శాతం వరకు ఛార్జ్‌ అవుతుంది. ఆపై రెండు గంటలలోపు పూర్తి ఛార్జ్‌ అవుతుంది. ఐఫోన్‌ ఛార్జింగ్‌ చాలా వేగవంతంగా అవుతుంది. ఆపిల్‌ ఐఓఎస్‌లో బ్యాటరీ ఆప్టిమైజ్‌ చేసి ఉంటుంది. ఈ ఫోన్‌కు ఛార్జింగ్‌ చేసే సమయంలో 80 శాతం వరకు ఛార్జింగ్‌ కాగానే దానంతట అదే ఛార్జ్‌ చేయకుండా నిలిపివేస్తుంది. కొన్ని ఫోన్‌లలో అలా ఉండదు. 100 శాతం పూర్తి కాగానే ఆగిపోతుంటుంది. అయితే పగటి సమయాల్లో ఛార్జింగ్‌ పెట్టి సమయానికి తీసివేయవచ్చు. కానీ రాత్రుల్లో ఛార్జింగ్‌ పెట్టి అలానే పడుకుంటే ఫోన్‌ త్వరగా చెడిపోయే అవకాశాలున్నాయంటున్నారు టెక్‌ నిపుణులు. చాలా మంది రాత్రుల్లో ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి అలానే మర్చిపోతుంటారు. అలాంటి సమయాల్లో ఫోన్‌ సర్వీస్‌ తగ్గిపోతుంటుంది. అందుకే రాత్రుల్లో ఛార్జింగ్‌ పెట్టినా 80 శాతంకుపైగా కాగానే ప్లగ్‌ తీసివేయాలని చెబుతున్నారు. చాలా మంది ఫోన్‌ వందశాతం ఛార్జ్‌ కాగానే మళ్లీ వాడుతుంటారు. మరికొంత బ్యాటరీ దిగిపోగానే మళ్లీ మళ్లీ ఛార్జింగ్‌ పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఇబ్బందులు తలెత్తుతాయి. 100 శాతం ఛార్జింగ్‌ కాగానే యూఎస్‌బీ కేబుల్‌ ప్లగ్‌కు అలానే వదిలేస్తుంటారు. దీని వల్ల విద్యుత్‌ సరఫరా అవుతూనే ఉంటుంది. వందశాతం వరకు బ్యాటరీ ఫుల్‌ కాగానే దాని ఫోన్‌లైఫ్‌ టైమ్‌ అనేది తగ్గిపోతుందని చెబుతున్నారు టెక్‌ నిపుణులు.

ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌ ఛార్జింగ్‌ జీరో అయ్యే అరకు ఉంచకూడదు. అలా చేస్తే మీ ఫోన్‌ పనితీరు మందగిస్తుంది. త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. బ్యాటరీల్లో పని చేసే ఛార్జ్‌ సైకిల్స్‌ పనితీరు తగ్గిపోతుంది. రాత్రి సమయాల్లో చాలా మంది ఛార్జింగ్‌ పెట్టి పడుకుంటారు. అలా చేయడం మంచిది కాదంటున్నారు. రాత్రంతా ఫోన్‌ ఛార్జ్‌ కావడం వల్ల ఫోన్‌లో ఉండే డివైజ్‌ వెడెక్కిపోతుంది. కొన్ని సందర్భాలలో ఫోన్‌లు పేలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. గంటల తరబడి ఫోన్‌ ఛార్జింగ్‌ పెడితే మీ ఫోన్‌ త్వరగా చెడిపోయే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే కొంత మంది ఫోన్‌ ఛార్జింగ్‌ అవుతుండగానే కాల్స్‌ మాట్లాడుతుంటారు. అలా మాట్లాడటం ప్రమాదమే. ఇలా చేయడం వల్ల సిగ్నల్స్‌, విద్యుత్‌ ప్రవాహం వల్ల ఒత్తిడిపెరిగిపోయి ఫోన్‌ పేలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాకుండా ఫోన్‌ను పదేపదే ఛార్జింగ్‌ పెడుతుంటారు. అలా పెట్టడం వల్ల ఫోన్‌ త్వరగా పాడయ్యే అవకాశాలున్నాయంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..