జగన్ సర్కార్ సంచలనం.. భారీగా తగ్గించిన పీజీ వైద్య విద్య ఫీజులు..

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. డబ్బున్న వారికే పీజీ వైద్య విద్య సొంతం కాకూడదనే ఉద్దేశ్యంతో పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలన్నింట్లోనూ ఫీజులను తగ్గించింది. ఈ తగ్గించిన పీజీ వైద్య విద్య ఫీజులు 202-21 నుంచి 2022- 2023 వరకు అమలులో […]

జగన్ సర్కార్ సంచలనం.. భారీగా తగ్గించిన పీజీ వైద్య విద్య ఫీజులు..
Follow us

|

Updated on: May 30, 2020 | 11:47 AM

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. డబ్బున్న వారికే పీజీ వైద్య విద్య సొంతం కాకూడదనే ఉద్దేశ్యంతో పేద విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కన్వీనర్‌ కోటా, యాజమాన్య కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాలన్నింట్లోనూ ఫీజులను తగ్గించింది. ఈ తగ్గించిన పీజీ వైద్య విద్య ఫీజులు 202-21 నుంచి 2022- 2023 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

మైనారిటీ, నాన్- మైనారిటీ, ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలలన్నింటికి కూడా ఒకే తరహ ఫీజులు ఉండనున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ బృహత్తర నిర్ణయంతో దాదాపు అన్ని కేటగిరీలలోనూ ఫీజులు సగానికి సగం తగ్గిపోయాయి. కాగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు పీజీ వైద్య విద్య సీట్ల భర్తీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు భారీ లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని రూల్స్ ఇలా ఉన్నాయి..

  • ఏపీ ఫీ రెగ్యులేటరీ కమిటీ ప్రతిపాదించిన మేరకే ఫీజుల నిర్ణయం
  • వార్షిక ఫీజును కాలేజీ యాజమాన్యాలు రెండు దఫాలుగా వసూలు చేయవచ్చు
  •  ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు.
  • ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్యార్ధులకు ఇస్తున్న స్టైఫండ్‌నే ప్రైవేటు కాలేజీలలో కూడా ఇవ్వాలి.
  • ఫీజుల వసూళ్ళపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.

మెడికల్ అడ్మిషన్స్ నిలిపివేత…

ఈ ఏడాది పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా తగ్గిస్తూ ఏపీ ఫీ రెగ్యులేటరీ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 12 మెడికల్, 13 డెంటల్ కాలేజీలలో మెడికల్, డెంటల్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు నిలిపేస్తున్నట్లు ఏపీ మెడికల్ అండ్ డెంటల్ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే విద్యార్ధులకు ఇచ్చే స్టైఫండే ఎక్కువగా ఉందని.. ప్రస్తుతం ప్రైవేటు మెడికల్ కళాశాలలన్నీ కూడా కరోనా ఆసుపత్రులుగా మారినట్లు పేర్కొంటూ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి యాజమాన్యం లేఖ రాసింది.

Also Read: లాక్‌డౌన్‌ 5.0పై రాష్ట్రాలదే తుది నిర్ణయం..?