పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్… వెంటనే ఇలా చేయండి.. లేదంటే నష్టమే!

2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ప్రయోజననం పొందాలంటే కచ్చితంగా ఒక పని మాత్రం చేయాలి. ఈపీఎఫ్‌వో యూఏన్ యాక్టివేషన్ చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే పెరిగిన వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. అంటే కంపెనీ నుంచి యూఏఎన్ నెంబర్ ఉన్న వారికే వడ్డీ పెంపు వర్తిస్తుంది. మీకు యూఏఎన్ నెంబర్ లేకపోతే ఈ ప్రయోజనం కోసం […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:22 pm, Fri, 11 October 19
పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... వెంటనే ఇలా చేయండి.. లేదంటే నష్టమే!

2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ప్రయోజననం పొందాలంటే కచ్చితంగా ఒక పని మాత్రం చేయాలి. ఈపీఎఫ్‌వో యూఏన్ యాక్టివేషన్ చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే పెరిగిన వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. అంటే కంపెనీ నుంచి యూఏఎన్ నెంబర్ ఉన్న వారికే వడ్డీ పెంపు వర్తిస్తుంది. మీకు యూఏఎన్ నెంబర్ లేకపోతే ఈ ప్రయోజనం కోసం వేచిచూడాల్సిందే. యూఏఎన్ లేకపోతే మీ కంపెనీని అడిగి ఆ నెంబర్ తీసుకోండి. తర్వాత ఆన్‌లైన్‌లో దాన్ని యాక్టివేట్ చేసుకోండి. 20 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులను కలిగిన కంపెనీలు కచ్చితంగా వారికి ఈపీఎఫ్‌వోలో చందాదారులగా చేర్చాలి.

కంపెనీ ఈపీఎఫ్‌వో వద్ద రిజిస్టర్ అయితే అప్పుడు ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బేసిక్ వేతనం రూ.15,000 వరకు ఉంటుంది. అలాగే వీరు ఈపీఎఫ్‌లో కూడా చేరాలి. ఈపీఎఫ్ ఫండ్‌లో ఎంప్లాయీ, కంపెనీ 12 శాతం చొప్పున జమచేయాల్సి ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరికీ ఈపీఎఫ్‌వో యూఏఎన్ నెంబర్‌ను కేటాయిస్తుంది. దీంతో ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే పీఎఫ్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్, మెంబర్ ఐడీ, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ వంటి వివరాలు అవసరం అవుతాయి. మీరు వెంటనే కంపెనీ హెచ్ఆర్ అధికారులను అడిగి యూఏఎన్ నెంబర్ తీసుకోండి. ఈపీఎఫ్‌వో పోర్టల్‌కు వెళ్లి దాన్ని యాక్టివేట్ చేసుకోండి.