Petrol Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పెరిగాయా..? తగ్గాయా.? పూర్తి వివరాలు..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్దిపాటి మార్పులు కనిపించాయి. అయితే మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా  ఉండగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా

Petrol Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. పెరిగాయా..? తగ్గాయా.? పూర్తి వివరాలు..
Petrol
Follow us

|

Updated on: Sep 17, 2021 | 8:59 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో కొద్దిపాటి మార్పులు కనిపించాయి. అయితే మెట్రో నగరాల్లో ధరలు స్థిరంగా  ఉండగా.. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా పెంచలేదు. శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చిన్నపాటి మార్పు కనిపిస్తున్నాయి. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 96.80గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.96.80గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.13గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.49గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.39గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26 ఉండగా.. డీజిల్ ధర రూ.96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.51 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.98.80 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.71 ఉండగా.. డీజిల్ ధర రూ. 97.72 గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.08లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.55గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.75గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.66గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.51 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.98.44లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.62 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 91.71 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.12ఉండగా.. డీజిల్ ధర రూ.93.36గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.94.04 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.30 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.89.02గా ఉంది.

ఇవి కూడా చదవండి: IIT Admission 2021: ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా IIT లో అడ్మిషన్ తీసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..

PM Modi: సంచలనాత్మక నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ప్రధాని నరేంద్ర మోడీ..! గొప్ప నాయకుడిగా ఎలా మారారో తెలుసా?