ఏపీలో పర్యాటక శాఖ కీలక నిర్ణయం…

రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను ప్రారంభించేందుకు అనుమతిస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు పర్యాటక శాఖ సిద్ధమైందన్నారు. పర్యాటక ప్రాంతాలతో పాటు

  • Sanjay Kasula
  • Publish Date - 8:21 pm, Fri, 4 September 20
ఏపీలో పర్యాటక శాఖ కీలక నిర్ణయం...

Tourist Areas in AP : రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను ప్రారంభించేందుకు అనుమతిస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు పర్యాటక శాఖ సిద్ధమైందన్నారు. పర్యాటక ప్రాంతాలతో పాటు రోప్ వే, బోటింగ్ కార్యకలాపాలు, సాహస క్రీడలు, పర్యాటక రవాణా కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ అనుమతిచ్చింది.

టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు యధావిధిగా కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని రజత్ భార్గవ పేర్కొన్నారు. చారిత్రక ప్రాంతాలు, పురావస్తు మ్యూజియంలను కూడా ప్రారంభించేందుకు అనుమతిచ్చారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పర్యాటక కార్యకాలాపాలు నిర్వహించుకోవాలని రజత్ భార్గవ ఆదేశించారు.