చేనేతపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

Pawan Kalyan sensational decision on weavers: చేనేత రంగమంటే తనకు అత్యంత మక్కువ అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కర్నూలు జిల్లా పర్యటనలో వున్న జనసేనాని.. గురువారం ఎమ్మిగనూరు చేనేత కాలనీలో పర్యటించారు. చేనేతల సమస్యలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల సమస్యలపై తాను పోరాడతానని ప్రకటించారు. చేనేత కార్మికులతో ఇంటరాక్షన్ అనంతరం గురువారం పవన్ కల్యాణ్ వారినుద్దేశించి ప్రసంగించారు. చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వుంటానని హామీ ఇచ్చారు జనసేనాని. […]

చేనేతపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
Rajesh Sharma

|

Feb 13, 2020 | 5:27 PM

Pawan Kalyan sensational decision on weavers: చేనేత రంగమంటే తనకు అత్యంత మక్కువ అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కర్నూలు జిల్లా పర్యటనలో వున్న జనసేనాని.. గురువారం ఎమ్మిగనూరు చేనేత కాలనీలో పర్యటించారు. చేనేతల సమస్యలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల సమస్యలపై తాను పోరాడతానని ప్రకటించారు.

చేనేత కార్మికులతో ఇంటరాక్షన్ అనంతరం గురువారం పవన్ కల్యాణ్ వారినుద్దేశించి ప్రసంగించారు. చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వుంటానని హామీ ఇచ్చారు జనసేనాని. చేనేతల సమస్యల కోసం పోరాడుతానన్నారు. స్వలాభాపేక్ష కోసం పార్టీ ఏర్పాటు చేయలేదు… అలాంటి ఉద్దేశం లేదు.. ప్రజా సమస్యల కోసం ఏర్పడ్డ పార్టీ జనసేన.. అని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. చేనేతల కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. చేనేత రంగ సమస్యలపై చర్చించేందుకు త్వరలో జనసేన పార్టీ తరపున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu