ఐపీఎల్‌పై కన్నేసిన ప‌తంజ‌లి

ఐపీఎల్‌పై కన్నేసిన ప‌తంజ‌లి

Patanjali Likely to Bid for IPL Title Sponsorship : ఐపీఎల్ 2020 బ్రాండింగ్ మీద పతంజలి కన్నేసింది. ఐపీఎల్ 2020కి ఎవ‌రు స్పాన్స‌ర్ నుంచి చైనా కంపెనీ వీవో తప్పుకోవడంతో ఇప్పుడు ఎవరు అనే పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి సమయంలో  ప‌తంజ‌లి ఐపీఎల్‌కు స్పాన్స‌ర్‌గా దక్కించుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప‌తంజ‌లి బ్రాండ్‌కు అంతర్జాతీయంగా ఐపీఎల్ ఉపయోగపడుతుందని ఆ సంస్థ ప్ర‌తినిధి ఎస్‌కే తిజ‌రావాలా తెలిపారు. ఈ నేప‌థ్యంలో బీసీసీకి ప్ర‌తిపాద‌న పంపనున్న‌ట్లు […]

Sanjay Kasula

|

Aug 10, 2020 | 1:32 PM

Patanjali Likely to Bid for IPL Title Sponsorship : ఐపీఎల్ 2020 బ్రాండింగ్ మీద పతంజలి కన్నేసింది. ఐపీఎల్ 2020కి ఎవ‌రు స్పాన్స‌ర్ నుంచి చైనా కంపెనీ వీవో తప్పుకోవడంతో ఇప్పుడు ఎవరు అనే పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటి సమయంలో  ప‌తంజ‌లి ఐపీఎల్‌కు స్పాన్స‌ర్‌గా దక్కించుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప‌తంజ‌లి బ్రాండ్‌కు అంతర్జాతీయంగా ఐపీఎల్ ఉపయోగపడుతుందని ఆ సంస్థ ప్ర‌తినిధి ఎస్‌కే తిజ‌రావాలా తెలిపారు. ఈ నేప‌థ్యంలో బీసీసీకి ప్ర‌తిపాద‌న పంపనున్న‌ట్లు ఆయ‌న వెల్లడించారు. అయితే ఐపీఎల్ ను దక్కించుకునేందుకు ఇప్పటికే పదికిపైగా కంపెనీలు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఈ కామర్స్ దిగ్గజం పోటీ పడుతోంది. అమెజాన్ తర్వాత ఇదే వరసలో టీమిండియా జెర్సీ స్పాన్సర్‌ బైజుస్‌, ఫాంటసీ స్పోర్ట్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ 11, అన్‌ అకాడమీ, మైసర్కిల్‌ 11 సహా కొన్ని సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

అయితే.. కానీ ఐపీఎల్ స్పాన్స‌ర్‌షిప్ నుంచి వీవో వెళ్లిపోవ‌డాన్ని ఆర్థిక సంక్షోభంగా చూడ‌రాదు అని ఇప్పటికే ఒకసారి బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ స్పష్టం చేశారు. అయితే త‌మ వ‌ద్ద ప్లాన్ బీ ఉన్న‌ట్లు కూడా గంగూలీ చెప్పిన విష‌యం తెలిసిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu