కరోనాని ఎన్‌క్యాష్ చేసుకున్నాడు: తెలుగురాష్ట్రాల్లో సామాజిక సేవంటూ పాస్టర్ మహామాయ, కోట్ల సొమ్ముతో పరార్

తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవ ముసుగులో ఓ కేటుగాడు ఘరానా మోసాలకు పాల్పడ్డాడు. బ్యాంక్ రుణాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కోట్లు మూటగట్టుకుని..

కరోనాని ఎన్‌క్యాష్ చేసుకున్నాడు: తెలుగురాష్ట్రాల్లో సామాజిక సేవంటూ పాస్టర్ మహామాయ, కోట్ల సొమ్ముతో పరార్
Follow us

|

Updated on: Dec 23, 2020 | 3:39 PM

తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవ ముసుగులో ఓ కేటుగాడు ఘరానా మోసాలకు పాల్పడ్డాడు. బ్యాంక్ రుణాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కోట్లు మూటగట్టుకుని బిచాణ ఎత్తేశాడు. పలు ప్రాంతాల్లో ఈ మోసగాడు ప్రజాసేవ ముసుగులో లక్షలు గడిస్తూ ప్రజల్ని బురిడీ కొట్టించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ ప్రాంతానికి చెందిన జాన్ – పాస్టర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ ని ఎన్ క్యాష్ చేసుకుని లాక్‌డౌన్‌ టైమ్‌లో సామాజిక సేవా కార్యక్రమాలతో వెలుగులోకి వచ్చాడు. కరోనాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, మీడియా, పారిశుద్ధ్య సిబ్బందికి సాయం చేసేవాడు. అంతేనా… తాను చేసే సేవా కార్యక్రమాలకు పోలీసు ఉన్నతాధికారులను ఆహ్వానించి వారి చేతుల మీదుగా సహాయం అందజేసి ప్రశంసలు అందుకున్నాడు. ఈ ఇమేజ్‌ని అడ్డు పెట్టుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానని, పోలీస్ కేసుల్లో పేరు లేకుండా చేస్తానని మాయ మాటలు చెప్పి చాలా మంది అమాయకులను నమ్మించాడు. ఉన్నతాధికారులతో దిగిన ఫోటోలు తరచుగా వాట్సప్‌లో పోస్ట్ చేయడంతో అమాయకులు పాస్టర్ జాన్ మాయలో పడిపోయారు. పలువురికి PMRY రుణాలు ఇప్పిస్తానని లక్షల రూపాయలు వసూలు చేసాడు.

ఇలా, దాదాపు 60 నుంచి 80 మంది వద్ద… దాదాపు కోటిన్నర రూపాయలు వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడం, రుణాలు అందక పోవడంతో మోసపోయామని తెలుసుకొని బాధితులు లబోదిబోమంటున్నారు. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పాస్టర్ జాన్‌ను నిలదీశారు. డబ్బులు తిరిగి చెల్లిస్తానని కొందరికి చెక్కులు , అగ్రిమెంట్లు రాసిచ్చి కాలయాపన చేశాడు. బాధితుల ఒత్తిడి పెరగడంతో చివరకు పాస్టర్ జాన్ జెండా ఎత్తేశాడు. మోసగాడు పాస్టర్‌ జాన్‌పై చివ్వెంల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ కేటుగాడిపై తెలుగు రాష్ట్రాల్లో పలు చీటింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..