మూడు పార్టీల మధ్య వార్.. కారణమిదే

రాజధాని అంశం ఆంధప్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకవైపు ఉడికిస్తుంటే.. పలు చోట్ల మూడు ప్రధాన పార్టీల నేతలు న్యూ ఇయర్ ఫ్లెక్సీల కోసం కొట్టుకుంటుండడం కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల శ్రేణులు రాజకీయ అంశాలను వదిలిపెట్టి న్యూ ఇయర్ ఫ్లెక్సీల కోసం ఫైట్ చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేతకు నువ్వంటే నువ్వు కారణమని ఆరోపించుకుంటూ వీధి పోరాటాలకు దిగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో టీడీపీ-వైసీపీ వర్గాలు కర్రలు, కత్తులతో దాడి చేసుకుని నూతన సంవత్సర వేడుకల్లో […]

మూడు పార్టీల మధ్య వార్.. కారణమిదే
Follow us

|

Updated on: Jan 01, 2020 | 1:09 PM

రాజధాని అంశం ఆంధప్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకవైపు ఉడికిస్తుంటే.. పలు చోట్ల మూడు ప్రధాన పార్టీల నేతలు న్యూ ఇయర్ ఫ్లెక్సీల కోసం కొట్టుకుంటుండడం కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల శ్రేణులు రాజకీయ అంశాలను వదిలిపెట్టి న్యూ ఇయర్ ఫ్లెక్సీల కోసం ఫైట్ చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేతకు నువ్వంటే నువ్వు కారణమని ఆరోపించుకుంటూ వీధి పోరాటాలకు దిగుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో టీడీపీ-వైసీపీ వర్గాలు కర్రలు, కత్తులతో దాడి చేసుకుని నూతన సంవత్సర వేడుకల్లో పాతకక్షలకు తెరలేపారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రోడ్డుపై కేక్ కట్ చేసే విషయంలోను, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలోను గొడవలకు దిగారు రెండు పార్టీల కార్యకర్తలు. వైసీపీ వర్గీయులు కొంతమంది టీడీపీ సానుభూతి పరులైన ద్వారంపూడి వెంకట్ రెడ్డి ఇంటి పైకి వెళ్లి అద్దాలను పగులగొట్టారు. మొక్కలను ధ్వంసం చేశారు.

ఎంత వద్దన్నా వినకుండా అడ్డొచ్చిన వారిని కొట్టి ఇంటిని ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికార పార్టీ వారికే పోలీసులు మద్దతు తెలిపి తిరిగి మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారని బాధితులు వాపోతున్నారు. ఫ్లెక్సీలు కట్టే విషయంలో వివాదం తలెత్తింది. ఇంటిని ధ్వంసం చేసే వరకు దారి తీసింది. రోడ్డుకు అడ్డుగా ఫ్లెక్సీలు పెట్టారంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు వైసీపీ వర్గం సత్తిబాబు దళితులతో.. టీడీపీ వర్గం రాము అనుచరులు కలబడ్డారు. ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరోవైపు గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరులో వైసిపి-టిడిపి వర్గాలు ఫ్లెక్సీల కోసం కొట్టుకున్నాయి. ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టారు. ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులను అరెస్టు చేశారు. ఒకరిపై ఇంకొకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇంకోవైపు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో వైసిపి ప్లెక్సీ చించేయడంతో అధికార పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. రాజోలు వైసిపి ఇంచార్జ్ బొంతు రాజేశ్వర రావు న్యూ ఇయర్ ఫ్లెక్సీ ని చించిన అనంతరం రోడ్డుపై జై రాపాక జనసేన కార్యకర్తలు రాయడంతో వివాదం రెట్టింపయ్యింది. బొంతు ఫ్లెక్స్ చించి రోడ్డుపై పిచ్చి రాతలు రాస్తారా అంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. గత కొన్ని నెలలుగా రాజోలులో వైసీపీ, జనసేన వివాదం కొనసాగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా వివాదం పీక్ లెవల్‌కు చేరింది.

ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి