రేపటి నుంచే పార్లమెంట్, అఖిల పక్ష సమావేశం రద్దు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే  సెషన్ కి ముందు ఎప్పుడూ సాధారణంగా జరిగే అఖిల పక్ష సమావేశాన్ని ఈ సారి రద్దు చేశారు. రెండు దశాబ్దాల తరువాత..

రేపటి నుంచే పార్లమెంట్, అఖిల పక్ష సమావేశం రద్దు
Follow us

| Edited By: Balu

Updated on: Sep 13, 2020 | 10:41 AM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే  సెషన్ కి ముందు ఎప్పుడూ సాధారణంగా జరిగే అఖిల పక్ష సమావేశాన్ని ఈ సారి రద్దు చేశారు. రెండు దశాబ్దాల తరువాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్షాలకు మధ్య విభేదాలు పెరుగుతున్నాయనడానికి సూచికగా దీన్ని భావిస్తున్నారు. అటు-సమావేశాల ఎజెండా గురించి చర్చించేందుకు ఓం బిర్లా ఇవాళ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సెషన్లో… ప్రశ్నోత్తరాల సమయం రద్దు, జీరో ఆవర్ కుదింపు వంటి అంశాలపై  చర్చించే అవకాశం ఉంది.   ..ఇండో-చైనా మధ్య రగడ, కుంగుతున్న ఎకానమీ, కరోనా వైరస్ పాండమిక్ లాంటి విషయాలను సభ్యులు ముఖ్యంగా ఈ సెషన్ లో  ప్రస్తావించనున్నారు. ఎంపీలంతా తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ముందే నిబంధన విధించారు.

లోక్ సభ, రాజ్యసభ వేర్వేరు షిఫ్తుల్లో కొనగనున్నాయి. ఈ సెషన్ అక్టోబర్ 1 వరకు జరుగుతుంది.