అన్యాయంగా చంపేశారు: నిందితుల తల్లిదండ్రుల ఆరోపణ!

‘దిశ’ కేసులోని నలుగురి నిందితులను పోలీసులు ఇవాళ తెల్లవారుజామున షాద్‌‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జ్ దగ్గర ఎన్‌‌కౌంటర్‌లో కాల్చి చంపారు. మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను పోలీసులు.. దిశ మరణించిన ప్రదేశంలోనే ఎన్‌‌కౌంటర్‌ చేయడంతో దేశవ్యాప్తంగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు తమపై రాళ్లు రువ్వి.. ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారని.. ఆ సందర్భంలోనే తమకు తాము ఆత్మరక్షణ కోసం ఎన్‌‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతుండగా.. తమ బిడ్డలను కావాలనే పోలీసులు హతమార్చారని […]

అన్యాయంగా చంపేశారు: నిందితుల తల్లిదండ్రుల ఆరోపణ!
Follow us

|

Updated on: Dec 07, 2019 | 6:10 AM

‘దిశ’ కేసులోని నలుగురి నిందితులను పోలీసులు ఇవాళ తెల్లవారుజామున షాద్‌‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి బ్రిడ్జ్ దగ్గర ఎన్‌‌కౌంటర్‌లో కాల్చి చంపారు. మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను పోలీసులు.. దిశ మరణించిన ప్రదేశంలోనే ఎన్‌‌కౌంటర్‌ చేయడంతో దేశవ్యాప్తంగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు తమపై రాళ్లు రువ్వి.. ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారని.. ఆ సందర్భంలోనే తమకు తాము ఆత్మరక్షణ కోసం ఎన్‌‌కౌంటర్‌ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతుండగా.. తమ బిడ్డలను కావాలనే పోలీసులు హతమార్చారని నిందితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు తమ కొడుకులను కావాలనే చంపేశారని.. దాన్ని దాచిపెడుతూ ఎన్‌‌కౌంటర్‌ జరిగిందని అబద్దాలు చెబుతున్నారని మహమ్మద్ ఆరిఫ్ తల్లి, చెన్నకేశవులు తల్లి కన్నీటిపర్యంతం అయ్యారు. నిందితులకు శిక్షలు విధించడానికి కోర్టులు ఉన్నాయని.. ఇలా పోలీసులే అన్యాయంగా చంపేస్తే.. ఇంక న్యాయం ఎక్కడని వారు ప్రశ్నించారు. డాక్టర్ దిశకు జరిగిన దానికి తమకు కూడా బాధగా ఉందని.. తమ బిడ్డలను కాపాడుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని.. కానీ శిక్షలు చట్టపరంగా విధించడమే సమంజసం అని అంటున్నారు. కాగా, నిందితులు ఎన్‌‌కౌంటర్‌‌లో మృతి చెందటం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.