Academic Year: విద్యాసంస్థలకు సెకెండ్ వేవ్ షాక్.. ఓవైపు కరోనా..ఇంకోవైపు ఎండలు.. అకాడమిక్ ఇయర్ రద్దేనా?

విద్యాసంవత్సరం ముగింపు దశలో విద్యాసంస్థలు పున: ప్రారంభమవుతున్న విచిత్రమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎదురైంది. కరోనా మహమ్మారి ఏకంగా ఓ ఏడాదిని మింగేసిన దరిమిలా..

Academic Year: విద్యాసంస్థలకు సెకెండ్ వేవ్ షాక్.. ఓవైపు కరోనా..ఇంకోవైపు ఎండలు.. అకాడమిక్ ఇయర్ రద్దేనా?
Follow us

|

Updated on: Mar 01, 2021 | 4:00 PM

Parents demanding academic year abash: విద్యాసంవత్సరం ముగింపు దశలో విద్యాసంస్థలు పున: ప్రారంభమవుతున్న విచిత్రమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎదురైంది. కరోనా మహమ్మారి ఏకంగా ఓ ఏడాదిని మింగేసిన దరిమిలా.. ఇపుడిపుడే పరిస్థితి కుదుట పడుతుందన్న విశ్వాసంతో విద్యాసంస్థల పున: ప్రారంభానికి ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. విద్యాసంస్థలను ఇపుడు తెరిచి సాధించేదేముందంటున్న తల్లిదండ్రులు.. విద్యాసంవత్సరాన్ని రద్దు చేసి.. అందరినీ పాస్ చేయాలని కోరుతున్నారు. దీనికి వారు చెబుతున్న కారణాలు ఆలోచించ దగినవిగా వుండడంతో ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారుతోంది.

బడి గంట మోగింది.. విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో దడదడ మొదలైంది.. ఒకవైపు కరోనా సెకెండ్ వేవ్ మొదలైందన్న కథనాల నేపథ్యం.. ఇంకోవైపు ఊపందుకోని వ్యాక్సినేషన్ ప్రక్రియ.. వెరసి పిల్లల ప్రాణాలను ఫణంగా పెట్టలేమంటున్న పేరెంట్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. విద్యాసంస్థల్లో ఉన్నత తరగతులను నడిపించేందుకు గత డిసెంబర్ నెలలోనే ప్రభుత్వాలు అనుమతించాయి. కానీ చాలా విద్యాసంస్థలు పేరెంట్స్ అభిప్రాయాలను తెలుసుకుని తరగతులను క్యాంపస్‌లలో కాకుండా ఆన్‌లైన్‌లో మాత్రమే నడిపిస్తున్నారు. ఇంటర్ విద్యార్థులు సైతం పెద్ద సంఖ్యలో ఇంటి వద్దనే వుండి తరగతులకు అటెండవుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలలో సెకెండ్ వేవ్ కరోనా టెన్షన్ పెంచుతోంది. దాంతో విద్యాసంస్థలు మళ్ళీ మూత పడుతున్నాయి. దీని ప్రభావం తెలంగాణపై కూడా కనిపిస్తోంది చాలా పట్టణాల్లో సెల్ఫ్ లాక్ డౌన్ అమలు జరుగుతుంది.. మరో నెల రోజుల్లో విద్యా సంవత్సరం కూడా పూర్తి కానుంది.. కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పాఠశాలలు తెరవడం కన్నవారిని ఆందోళనకు గురి చేస్తుంది.. పిల్లల్ని స్కూళ్ళకు పంపడానికి నిరాకరిస్తున్న చాలామంది పేరెంట్స్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయిన తర్వాత తరగతులు ప్రారంభిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

కరోనా కల్లోలం నేపథ్యంలో గత ఏడాది మార్చి 22న మూత బడిన విద్యాసంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుండి తెరుచుకున్నాయి. మొదటి దశలో 9,10 నుండి ఆపై తరగతుల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చిoది.. రెండవ దశలో 6,7,8 తరగతుల నిర్వహణకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది.. మార్చి 1వ తేదీ నుండి 6వ తరగతి నుండి పూర్తిస్థాయిలో తరగతులు ప్రారంభమయ్యాయి. బడి గంట మోగడంతో విద్యార్థులు పరుగులు పెడుతున్నారు.. కాళ్లకు షూస్, మెడకు టై తోపాటు మూతికి మాస్క్ యూనిఫామ్‌లో బాగంగా మారాయి. బ్యాగ్‌లో వాటర్ బాటిల్‌తో పాటు ఇంకో చిన్నపాటి బాటిల్‌లో శానిటైజర్‌ తీసుకుని బడికి బయలుదేరారు పిల్లలు. అయితే స్కూళ్ళ నిర్వహణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. కొందరు తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్లకు పంపడానికి నిరాకరిస్తున్నారు. దానికి కారణం సెకెండ్ వేవ్ మొదలైందన్న కథనాలే. తెలంగాణలో సెకెండ్ వేవ్ లేదని సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపినా ఫలితం కనిపించడం లేదు.

ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లానే ఉదాహరణగా తీసుకుంటే.. జిల్లాలో మొత్తం 3651 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి.. వీటిలో హై స్కూళ్ళు 746, ప్రాథమికోన్నత పాఠశాలలు 471,ప్రాథమిక పాఠశాలలు 2334 ఉన్నాయి.. ఇవి కాకుండా 1934 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి.. కరోనా ప్రభావంతో విద్యార్థులు హాజరు శాతం చాలా తక్కువగా కనిపిస్తుంది.. ఉమ్మడి జిల్లాలో మొదటిరోజు కేవలం 38శాతం మంది విద్యార్థులు మాత్రమే స్కూళ్లకు హాజరయ్యారు. అయితే కరోనా వైరస్ మళ్ళీ విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని వివిధ నగరాల్లో సెల్ఫ్ లాక్ డౌన్ అమలు జరుగుతుంది.. మరోవైపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు కూడా కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూత పడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్ళు తెరవడం పట్ల విద్యార్థులు తల్లిదండ్రులు విముఖత వ్యక్తం చేస్తున్నారు.. పాఠశాలలు తెరిచినా తమ పిల్లలను పంపలేమంటున్నా రు..మరో నెలరోజుల్లో విద్యా సంవత్సరం పూర్తికానున్న నేపథ్యంలో ఇప్పుడు స్కూళ్ళు తెరవడం వల్ల పిల్లల ప్రాణాలకు ముప్పు తప్ప ఎలాంటి ప్రయోజనం వుండదంటున్నారు.

కొంతమంది పేరెంట్స్ మాత్రం స్కూల్స్ రీ ఒపెన్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు… ఆన్ లైన్ తరగతుల కంటే స్కూల్ కు వెళ్లి చదువుకుంటేనే మంచిదని అంటున్నారు.. సరైన జాగ్రత్తలు తీసుకుని స్కూళ్లను ఓపెన్ చేయడం మంచిదే అంటున్నారు.. ఆన్ లైన్ క్లాసుల వల్ల సెల్ ఫోన్లకు, టీవీలకు అతుక్కుపోతు న్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ప్రస్తుతం ఆరవ తరగతి నుండి పై చదువులకు ప్రభుత్వం అనుమతివడంతో స్కూళ్ళు పునః ప్రారంభించిన విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామంటున్నారు. విద్యార్థులు క్రమశిక్షణగా మాస్కులు దరిస్తున్నారు.. కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు.. కానీ ఉపాద్యాయులు పాఠాలు బోధించే సమయంలో మాస్కులు తీసేయడం ఆందోళన కలిగిస్తోంది..ఈ నేపథ్యంలో విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ముందుగా వ్యాక్సిన్ విద్యార్థులకు అందే విధంగా చూడాలనీ, ఫ్రంట్‌లైన్ వారియర్స్ కింద టీచర్స్‌కు వ్యాక్సిన్ ఇవ్వాలని కోరుతున్నారు.

పొరుగునే వున్న మహారాష్ట్రలో కరోనా మరోసారి భారీగా విజృంభిస్తున్న నేపథ్యం ఒకవైపు.. ఇంకోవైపు ఎండా కాలం ఆరంభంలోనే ఊష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూ వుండడంతో పేరెంట్స్ కలవరం చెందుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో విజృంభించే ఎండల్లో పిల్లలను బడికి పంపడం శ్రేయస్కరం కాదనేది పేరెంట్స్ అభిప్రాయంగా కనిపిస్తోంది. దానికి తోడు ఎలాగో ఏడెనిమిది నెలల విద్యాసంవత్సరం వృధా అయిపోయింది. ఈ క్రమంలో పిల్లల ప్రాణాలను ఫణంగా పెట్టి ఒకట్రెండు నెలల్లో వారిని నేర్పేదేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ కూడా మొదలైన నేపథ్యంలో వచ్చే జూన్ నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేసి.. విద్యాసంవత్సరం ప్రారంభిస్తే బెటరన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

ALSO READ: హడలెత్తిస్తున్న మొసళ్ళు.. ఇటీవల కాలంలో ఎన్నో దాడులు.. ఎలా దాడులకు దిగాయో తెలిస్తే షాకే!

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు