అనంతపురం జిల్లాలో ఘోరం, ఎస్బీఐ మహిళాఉద్యోగిని హత్య చేసి తగలబెట్టిన దుండగులు

అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. ధర్మవరం రూరల్ బడన్నపల్లి పొలాల్లో ఒక యువతిని హత్య చేసి తగలబెట్టారు దుండగులు. యువతిని..

  • Venkata Narayana
  • Publish Date - 3:23 pm, Wed, 23 December 20
అనంతపురం జిల్లాలో ఘోరం, ఎస్బీఐ మహిళాఉద్యోగిని హత్య చేసి తగలబెట్టిన దుండగులు

అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. ధర్మవరం రూరల్ బడన్నపల్లి పొలాల్లో ఒక యువతిని హత్య చేసి తగలబెట్టారు దుండగులు. యువతిని మర్డర్‌ చేసి శరీరంపై పెట్రోల్ పోసి కాల్చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు స్నేహలత SBIలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆమె కనిపించడం లేదని నిన్న వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే స్నేహలత శవమై కనిపించింది. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.