పెళ్లయిన 12 రోజులకే..!

హాలీవుడ్ నటి 52 ఏళ్ల పమేలా అండర్సన్, హాలీవుడ్ నిర్మాత 74 ఏళ్ల జాన్ పీటర్స్ ఈ జంట జనవరి 20 న మాలిబులో వివాహం చేసుకున్నారు.ఆశ్చ్యర్యకరమైన విషయం ఏంటంటే.. పెళ్లయిన 12రోజులకే అతనితో విడిపోవాలని ఆమె డిసైడయిపోయింది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీరి వివాహం హాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె అభిమానులు మాత్రం ఈ విషయాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ఏ వయసులోనైనా […]

పెళ్లయిన 12 రోజులకే..!

హాలీవుడ్ నటి 52 ఏళ్ల పమేలా అండర్సన్, హాలీవుడ్ నిర్మాత 74 ఏళ్ల జాన్ పీటర్స్ ఈ జంట జనవరి 20 న మాలిబులో వివాహం చేసుకున్నారు.ఆశ్చ్యర్యకరమైన విషయం ఏంటంటే.. పెళ్లయిన 12రోజులకే అతనితో విడిపోవాలని ఆమె డిసైడయిపోయింది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీరి వివాహం హాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె అభిమానులు మాత్రం ఈ విషయాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. ఏ వయసులోనైనా ఓ తోడు కావాలనుకోవడంలో తప్పేముంది? అంటూ తమ అభిమాన నటిని సమర్థించుకున్నారు.

కాగా.. “జీవితం ఒక ప్రయాణం. ప్రేమ ఒక ప్రక్రియ. ఆ సార్వత్రిక సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని, మా వివాహ ధృవీకరణ పత్రం యొక్క లాంఛనప్రాయాన్ని నిలిపివేసి, ఈ ప్రక్రియపై విశ్వాసాన్ని ఉంచాలని పరస్పరం నిర్ణయించుకున్నాము. మా గోప్యతను గౌరవించినందుకు ధన్యవాదాలు, ”అని అండర్సన్ అన్నారు. ఇదే సమయంలో ఈ జంట వివాహ సర్టిఫికెట్ కోసం కూడా ఇంకా దరఖాస్తు చేయలేదనే విషయం కూడా బయటపడింది. దీంతో ఇక వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారంటూ హాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.

Published On - 5:17 pm, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu