International Cricket: పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త మ్యాచ్ ఇదే.. ఆ మ్యాచ్‌లో అందరూ డకౌట్లే..!

International Cricket: ఫిబ్రవరి 24.. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అంత్యంత చెత్త రోజు అని భావించాల్సిందే. ఎందుకంటే..

International Cricket: పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త మ్యాచ్ ఇదే.. ఆ మ్యాచ్‌లో అందరూ డకౌట్లే..!
Follow us

|

Updated on: Feb 25, 2021 | 8:01 PM

International Cricket: ఫిబ్రవరి 24.. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో అంత్యంత చెత్త రోజు అని భావించాల్సిందే. ఎందుకంటే.. ఫిబ్రవరి 25, 1993 సంవత్సరంలో.. పాకిస్తాన్, వెస్టిండీస్ జట్ల మధ్య అంతర్జాతీయ వన్డే మ్యాచ్ జరిగింది. వసీం అక్రమ్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు చాలా బలంగా ఉంది. కానీ, క్రీజ్‌లోకి దిగాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బలమైన జట్టుగా భావించిన పాకిస్తాన్.. కేవలం 43 పరుగులకే కుప్పకూలింది. ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవలేకపోయారు. ఫలితంగా ఘోర పరాజయంపాలయ్యారు. విండీస్ బౌలర్లు కోర్ట్నీ వాల్ష్, అండర్సన్ కమ్మిన్స్ పాక్ క్రికెటర్లను హడలెత్తించారు. ఇంతకీ పాకిస్తాన్ అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయిందో ఒకసారి పరిశీలిద్దాం.

టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది, అయితే ఓపెనర్ రమీజ్ రాజా.. పాట్రిక్ ప్యాటర్సన్ వేసిన మొదటి బంతికే ఔట్ అయ్యాడు. ఆ తరువాత గులాం అలీ సయీద్ అన్వర్ కూడా పెవిలియన్‌కు చేరుకోవడానికి ఎంతో సమయం తీసుకోలేదు. ఆ తరువాత.. నంబర్ ఫోర్‌గా వచ్చిన బ్యాట్స్ మాన్ జాహిద్ ఫజల్ జట్టు కోసం చాలా కష్టపడ్డాడు, కాని అతనిలా సహచర ఆటగాళ్లు ఎక్కువ సేపు ఆడలేకపోయారు. సలీం మాలిక్, ఆసిఫ్ ముజ్తాబా, వసీం అక్రమ్, రషీద్ లతీఫ్ అందరూ ఇలా వచ్చి అలా వెళ్లారు. చివరికి పాకిస్తాన్ జట్టు 19.5 ఓవర్లలో కేవలం 43 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది.

ఆరుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవలేకపోయారు.. పాకిస్తాన్ తరఫున జాహిద్ ఫజల్ అత్యధికంగా 21 పరుగులు చేశాడు. అయితే.. రమీజ్ రాజా, ఆసిఫ్ ముజ్తాబా, వసీం అక్రమ్, రషీద్ లతీఫ్, వకార్ యూనస్, ముష్తాక్ అహ్మద్ కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ అయ్యారు. ఇక ఆకిబ్ జావేద్ 4, సయీద్ అన్వర్ 5, సలీం మాలిక్ 1, గులాం అలీ రెండు పరుగులు చేశారు. జట్టులోని 10 మంది బ్యాట్స్ మెన్ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. కాగా, వెస్టిండీస్ తరఫున కోర్ట్నీ వాల్ష్ 9 ఓవర్లలో 16 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టగా.. అండర్సన్ 4 ఓవర్లలో 11 పరుగులకు ముగ్గురు బ్యాట్స్ మెన్లను పెవిలియన్‌కు పంపాడు. పాట్రిక్ ప్యాటర్సన్ 6 ఓవర్లుకు 14 పరుగులకు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.

మొత్తం మ్యాచ్‌లో కేవలం 7 ఫోర్లు మాత్రమే.. లక్ష్యాన్ని సాధించడంలో వెస్టిండీస్‌ పెద్దగా ఇబ్బంది పడలేదు. కేవలం 12.3 ఓవర్లలో మ్యాచ్ ముగించేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టు కోసం, బ్రియాన్ లారా 34 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 26 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రిచర్డ్సన్ అతనితో 7 పరుగులు చేసి అజేయంగా తిరిగి వచ్చాడు. విండీస్ నుండి బ్యాట్స్‌‌‌‌మెన్లలో డెస్మండ్ హేన్స్, ఫిల్ సిమన్స్, కార్ల్ హూపర్ ఉన్నారు. ఇక పాకిస్థాన్ బౌలింగ్‌లో వసీం అక్రమ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 7 ఫోర్లు ఉన్నాయి, అందులో ముగ్గురు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ కాగా, నలుగురు విండీస్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు.

Also read:

ఎమ్మెల్సీ కవిత క్యాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానికొకటి ఢికొన్న వాహనాలు.. 

సలాం డాక్టరమ్మా..! పది రూపాయలకే వైద్యం.. ‌భవిష్యత్ తరాలకు ఆదర్శం

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?