బాలాకోట్‌లోకి వెళ్లిన మీడియా.. ఏం చెప్పిందంటే..?

పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు 300మంది ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వచ్చినా.. వాటిని ఇటు భారత్, అటు పాకిస్థాన్ ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఈ దాడి జరిగిందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దానికి తోడు దాడులు జరిగిన ప్రదేశానికి బయటివారికి అనుమతిని నిరాకరించడంతో అందరిలో పలు అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం అంతర్జాతీయ మీడియాతో పాటు కొందరు […]

బాలాకోట్‌లోకి వెళ్లిన మీడియా.. ఏం చెప్పిందంటే..?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 12, 2019 | 7:30 PM

పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు 300మంది ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వచ్చినా.. వాటిని ఇటు భారత్, అటు పాకిస్థాన్ ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఈ దాడి జరిగిందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దానికి తోడు దాడులు జరిగిన ప్రదేశానికి బయటివారికి అనుమతిని నిరాకరించడంతో అందరిలో పలు అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం అంతర్జాతీయ మీడియాతో పాటు కొందరు దౌత్యవేత్తలను బాలాకోట్‌లోకి తీసుకెళ్లారు పాక్ అధికారులు. అయితే అనుమానాలు తీరడం పక్కనపెడితే.. అక్కడకు వెళ్లిన అధికారులకు కొత్త డౌట్లు ఉత్పన్నం అయ్యాయి.

43 రోజుల పాటు సందర్శనకు అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితులు ఏమిటీ..? అదే నిజం అనుకుంటే.. వాతావరణ పరిస్థితులను తట్టుకొని గతంలో అక్కడకు వచ్చిన రాయిటార్స్ ఏజెన్సీ విలేకర్లను ఎందుకు అనుమతించలేదు..? ఫిబ్రవరి 27 నుంచి మార్చి 14వరకు ఎందుకు సెలవులు ఇచ్చారు..? అక్కడ విద్యార్థులతో మాట్లాడేందుకు మీడియాపై ఆంక్షలు దేనికి..? ఈ ప్రశ్నలతో బుధవారం బాలాకోట్‌కు వెళ్లారు అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెందిన కొందరు జర్నలిస్ట్‌లు. ఈ సందర్శనకు ఐఎస్‌పీఆర్ మేజర్ జనరల్ ఆసీఫ్ గఫూర్ కూడా హాజరయ్యారు. ఇస్లామాబాద్ నుంచి ఓ హెలికాప్టర్‌లో ఈ బృందాన్ని మాన్సెరా వరకు తీసుకెళ్లారు అధికారులు. అక్కడి నుంచి అత్యంత కష్టమైన మార్గంలో దాదాపు గంటన్నర ప్రయాణించాక జైష్ క్యాంప్‌గా పేర్కొంటున్న మదర్సా వచ్చింది.

మసీదును తలపిస్తున్న ఆ క్యాంప్‌లో దాదాపు 150-200మంది పిల్లలు ఖురాన్ చదువుతున్నారు. వారంతా స్థానికులే. అక్కడ మదర్సా ప్రారంభంలో ఉన్న బోర్డుపై మసూద్‌ అజార్‌ బావ మౌలానా యూసఫ్‌ అజార్‌ పేరు ఉండటంపై ఐఎస్‌పీఆర్‌ డీజీ ఆసీఫ్‌ గఫూర్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ మదర్సాకు నిధులు, కోర్సులను ఆయన పర్యవేక్షిస్తారని తెలిపారు. ఇక అక్కడి వారితో మాట్లాడేందుకు మీడియాకు ఆంక్షలు విధించారు. దీంతో జర్నలిస్ట్‌ల అనుమానాలకు ఎలాంటి సమాధానాలు రాలేదు సరికదా కొత్త డౌట్లతో బయటకు వచ్చారు. కాగా భారత్‌లోని 91 స్థానాల్లో పోలింగ్‌కు ఒక్క రోజు ముందు మీడియాను బాలాకోట్‌కు తీసుకెళ్లి అక్కడేం జరగలేదని చెప్పే ప్రయత్నం పాకిస్థాన్ చేయడం గమనర్హం.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!