భారత వ్యతిరేక పాట పాడినందుకు రూ.3.8 కోట్ల నగదు ‘బహుమతి’ !

భారత వ్యతిరేక ప్రచారానికి పాకిస్తాన్ సదా ప్రయత్నిస్తూనే ఉంది.  సమయం లభిస్తే చాలు తన అక్కసును వెళ్ళగక్కుతూనే ఉంది. ఇండియాను విమర్శిస్తూ, కాశ్మీరీల స్వేఛ్చను కోరుతూ..షఫ్ ఖత్ అమానత్ అలీ అనే గాయకుడు..

భారత వ్యతిరేక పాట పాడినందుకు రూ.3.8 కోట్ల నగదు 'బహుమతి' !

భారత వ్యతిరేక ప్రచారానికి పాకిస్తాన్ సదా ప్రయత్నిస్తూనే ఉంది.  సమయం లభిస్తే చాలు తన అక్కసును వెళ్ళగక్కుతూనే ఉంది. ఇండియాను విమర్శిస్తూ, కాశ్మీరీల స్వేఛ్చను కోరుతూ..షఫ్ ఖత్ అమానత్ అలీ అనే గాయకుడు పాడిన పాటకు గాను  అతనికి రూ. 3.8 కోట్లను బహుమతిగా పాక్ అందజేసిందట. ‘జా ఛోడ్ దే మేరీ వాడీ’ (నా కాశ్మీర్ లోయను వదిలేయండి) అంటూ ఆ సింగర్ పాడిన పాటను పాకిస్థాన్ ఆర్మీ ఈ నెల 2 న విడుదల చేసింది. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ ఈ మొత్తాన్ని ఆ గాయకునికి ప్రకటించారు.

‘కాశ్మీర్ ప్రజలకు, స్వాతంత్య్రం కోసం నిరంతరం వారు జరుపుతున్న పోరాటానికి ఈ సాంగ్ నివాళి’ అని పాక్ సైన్యం పేర్కొంది. లాహోర్ లో పుట్టిన అమానత్ అలీ.. బాలీవుడ్ చిత్రాలకు కూడా పాడాడు. 2018 లో మహాత్మా గాంధీ 150 వ జయంత్యుత్సవాల సందర్భంగా కూడా అలీ పాడినట్టు తెలుస్తోంది.

 

Click on your DTH Provider to Add TV9 Telugu