‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’పై పాక్ మంత్రి ఫైర్!

మహేంద్రసింగ్‌ ధోని కీపింగ్‌ గ్లౌవ్స్‌పై ఉన్న ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ లోగోతో ధోని తన దేశభక్తిని, ఆర్మీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడని, భారత అభిమానులు, మీడియా కీర్తిస్తుంటే.. పాకిస్తాన్‌ మంత్రి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫెడరల్‌ మంత్రి అయిన ఫవాద్‌ చౌదరి ట్విటర్‌ వేదికగా ధోని చర్యను, భారత‌ మీడియాను తప్పుబట్టాడు. ‘ ధోని ఇంగ్లండ్‌లో క్రికెట్‌ ఆడుతున్నాడు.. కానీ […]

‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’పై పాక్ మంత్రి ఫైర్!
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 07, 2019 | 4:38 PM

మహేంద్రసింగ్‌ ధోని కీపింగ్‌ గ్లౌవ్స్‌పై ఉన్న ఆర్మీకి చెందిన ప్రత్యేకమైన లోగో ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ లోగోతో ధోని తన దేశభక్తిని, ఆర్మీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడని, భారత అభిమానులు, మీడియా కీర్తిస్తుంటే.. పాకిస్తాన్‌ మంత్రి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫెడరల్‌ మంత్రి అయిన ఫవాద్‌ చౌదరి ట్విటర్‌ వేదికగా ధోని చర్యను, భారత‌ మీడియాను తప్పుబట్టాడు. ‘ ధోని ఇంగ్లండ్‌లో క్రికెట్‌ ఆడుతున్నాడు.. కానీ యుద్దం చేయడం లేదు. ఈ వ్యవహారంపై భారత్‌లో ఓ వర్గం మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఓ పిచ్చి చర్చకు తెరలేపుతూ.. యుద్దం జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్నాయి. వారిని వెంటనే సిరియా, అప్గానిస్తాన్‌, రివాండాకు పంపించాలి.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఐసీసీ సైతం బలిదాన్‌ బ్యాడ్జ్‌పై అభ్యంతరం తెలిపింది. ధోనితో ఆ లోగోను తీయించాల్సిందిగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్‌ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదు. అయితే వివాదాస్పదంగా మారిన ఈ అంశానికి తెరదించాలని యోచించిన ఐసీసీ.. ఆ గుర్తు ఎలాంటి జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తు కాదని ధోనీ తరపున బీసీసీఐ స్వయంగా వివరణ ఇచ్చి అనుమతి తీసుకుంటే ప్రపంచకప్‌లో ఆ గ్లోవ్స్‌ని వినియోగించుకోవచ్చని తెలిపింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu