మోదీ పేరు చెప్పగానే..పాక్ రైల్వే మంత్రికి కరెంట్ షాక్‌ !

మోదీ పేరు చెప్పగానే..పాక్ రైల్వే మంత్రికి కరెంట్ షాక్‌ !
Pak Railways Minister Sheikh Rashid gets an electricity shock while speaking against PM Modi

భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్‌ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌కు ఊహించని “షాక్‌’ తగిలింది. శుక్రవారం నాడు ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. షరామామూలుగానే ఆయన దూకుడుగా ప్రసంగం ప్రారంభించారు..భారత వ్యతిరేకతను ప్రజలలో రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రసంగిస్తున్నాడు. కశ్మీర్‌ అవర్‌ కార్యక్రమం సందర్భంగా పాకిస్తాన్‌ రైల్వే మంత్రి తన ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించారు. సరిగ్గా మోదీ పేరు పలికిన సమయంలోనే ఊహించని విధంగా ఆయనకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దాంతో […]

Ram Naramaneni

|

Aug 30, 2019 | 7:21 PM

భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్‌ రైల్వే మంత్రి షేక్‌ రషీద్‌కు ఊహించని “షాక్‌’ తగిలింది. శుక్రవారం నాడు ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. షరామామూలుగానే ఆయన దూకుడుగా ప్రసంగం ప్రారంభించారు..భారత వ్యతిరేకతను ప్రజలలో రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రసంగిస్తున్నాడు. కశ్మీర్‌ అవర్‌ కార్యక్రమం సందర్భంగా పాకిస్తాన్‌ రైల్వే మంత్రి తన ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించారు. సరిగ్గా మోదీ పేరు పలికిన సమయంలోనే ఊహించని విధంగా ఆయనకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. దాంతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ వెంటనే ఆయన తిరిగి మరోసారి మోదీపై విరుచుకుపడ్డారు..పాక్‌ మంత్రికి షాక్‌ కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. భారత్‌పై విషం కక్కితే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని సోషల్‌ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu