తీరు మారని పాకిస్తాన్… బ్లాక్ లిస్టులో పెడతాం.. ‘ వాచ్ డాగ్ ‘ వార్నింగ్!

పాకిస్తాన్ ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదని ఆసియా-పసిఫిక్ గ్లోబల్ డివిజన్ వాచ్ డాగ్.. ‘ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘ (ఎఫ్ఏటీఎఫ్) మండిపడింది. కరడు గట్టిన ఉగ్రవాదులుగా హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటివారిని ఐక్యరాజ్యసమితి ముద్ర వేసిన నేపథ్యంలో… ఆ తీర్మానాన్ని భద్రతామండలి ఆమోదించినప్పటికీ.. దానికి అనుగుణంగా నడచుకోవడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందని ఈ సంస్థ తన 228 పేజీల నివేదికలో దుయ్యబట్టింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలపై ప్రధాని […]

తీరు మారని పాకిస్తాన్...  బ్లాక్ లిస్టులో పెడతాం.. ' వాచ్ డాగ్ ' వార్నింగ్!
Anil kumar poka

|

Oct 07, 2019 | 5:32 PM

పాకిస్తాన్ ఇప్పటికీ తన తీరు మార్చుకోలేదని ఆసియా-పసిఫిక్ గ్లోబల్ డివిజన్ వాచ్ డాగ్.. ‘ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ‘ (ఎఫ్ఏటీఎఫ్) మండిపడింది. కరడు గట్టిన ఉగ్రవాదులుగా హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటివారిని ఐక్యరాజ్యసమితి ముద్ర వేసిన నేపథ్యంలో… ఆ తీర్మానాన్ని భద్రతామండలి ఆమోదించినప్పటికీ.. దానికి అనుగుణంగా నడచుకోవడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందని ఈ సంస్థ తన 228 పేజీల నివేదికలో దుయ్యబట్టింది. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పేర్కొంది. తన గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలను, బృందాలను గుర్తించడానికి, వాటికి నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయో, వాటి మనీ లాండరింగ్ వ్యవహారాలను అంచనా వేసి వాటికి అడ్డుకట్ట వేయడానికి సంబంధించిన 40 నిర్దేశికాల్లో చాలావాటిని పాక్ ప్రభుత్వం అమలు చేయలేదని ఈ వాచ్ డాగ్ తెలిపింది. (ఈ నెల 5 న ఈ రిపోర్టు ప్రచురితమైంది). పాక్ ను ‘ పెంచిన బ్లాక్ లిస్టు ‘ లో ఉంచాలా, వద్దా అన్న విషయమై ఈ సంస్థ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. (ఇప్పటికే ఆ దేశాన్ని ‘ గ్రే ‘ లిస్టులో ఉంచిన విషయం తెలిసిందే).

గత ఆగస్టులో ఈ సంస్థ నిర్దేశించిన 40 సూత్రాల్లో ,ముప్పయ్ రెండింటిని పాటించడంలో కూడా ఇమ్రాన్ ఖాన్ సర్కార్ విఫలమైంది. జమాత్ ఉద్ దావా, లష్కరే తోయిబా, ఫలాహీ ఇన్సానియత్ ఫౌండేషన్ వంటివి ఇంకా పాకిస్తాన్ లో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. వీటి నియంత్రణకు అక్టోబరులోగా చర్యలు తీసుకోవాలని, లేదా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని గత జూన్ లోనే ఈ ఏజన్సీ హెచ్ఛరించింది. ‘ ఐరాస ముద్ర ‘ పడిన టెర్రరిస్టులపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన ‘ యాక్షన్ ప్లాన్ ‘ ను అమలు చేయకపోతే ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో పెడతామని, ఇందుకు సిధ్ధంగా ఉండాలని వాచ్ డాగ్ మళ్ళీ.. మళ్ళీ..వార్నింగ్ ఇవ్వడం విశేషం. పాకిస్తాన్ కు చైనా వెన్నుదన్నుగా ఉన్నప్పటికీ.. ఈ విధమైన హెచ్ఛరికలపై ఆ దేశం మౌనంగా ఉండడం కొసమెరుపు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu