కుక్క కరిస్తే కరవనీ.. పాకిస్థాన్ కు ఇండియా ‘ చురక ‘ !

కుక్క కరిస్తే కరవనీ.. పాకిస్థాన్ కు ఇండియా ' చురక ' !

పాకిస్తాన్ పట్ల ఇండియా వెరైటీగా కక్ష తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆ దేశానికి యాంటీ-రేబీస్ వ్యాక్సీన్ సరఫరాను నిలిపివేసింది. దీంతో అక్కడ కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కరాచీ నగరంలోనూ, సింధ్ ప్రావిన్స్ లోను ‘ కుక్కకాటు ‘ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిజానికి ఇది ఒకరకంగా ప్రాణ రక్షణ మందు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ నుంచి తాము దిగుమతి చేసుకునే యాంటీ రేబీస్ వ్యాక్సీన్ నాణ్యమైనదే గాక.. చవకయినదికూడా అని ‘ రాబీస్ ఫ్రీ […]

Anil kumar poka

|

Oct 16, 2019 | 7:04 PM

పాకిస్తాన్ పట్ల ఇండియా వెరైటీగా కక్ష తీర్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆ దేశానికి యాంటీ-రేబీస్ వ్యాక్సీన్ సరఫరాను నిలిపివేసింది. దీంతో అక్కడ కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కరాచీ నగరంలోనూ, సింధ్ ప్రావిన్స్ లోను ‘ కుక్కకాటు ‘ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిజానికి ఇది ఒకరకంగా ప్రాణ రక్షణ మందు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ నుంచి తాము దిగుమతి చేసుకునే యాంటీ రేబీస్ వ్యాక్సీన్ నాణ్యమైనదే గాక.. చవకయినదికూడా అని ‘ రాబీస్ ఫ్రీ కరాచీ ప్రోగ్రామ్ ‘ అనే సంస్థ డైరెక్టర్ నసీం సలావుద్దీన్ అంటున్నారు. ఇండియా నుంచి తమకు వెయ్యి రూపాయలకే ఈ మందు లభ్యమవుతుండగా.. యూరప్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ మందుకోసం 70 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని ఆయన చెబుతున్నారు.

తమ దేశంలో కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఇది లభ్యమవుతోందని, అయితే భారత్ నిర్ణయం కారణంగా ఈ ఆసుపత్రులు ఈ వ్యాక్సీన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని సలావుద్దీన్ పేర్కొన్నారు. ఇటీవలే చైనా కూడా ఈ మందును పాకిస్థాన్ కు సరఫరా చేయడాన్ని నిలిపివేయడంతో ఆ దేశం అల్లల్లాడుతోంది. సింధ్ రాష్ట్రంతో బాటు కరాచీలో ఇటీవలి నెలల్లో అనేకమంది వీధికుక్కల కాట్లకు గురయ్యారు. వీరిలో కొందరు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. కేవలం కొన్ని నెలల కాలంలో ఈ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 130 కుక్క కాటు కేసులు నమోదయ్యాయట. ఈ నెల 14 వ తేదీ రాత్రి ఓ ఎస్సై సహా 12 మంది కుక్కకాటు బాధితులు కరాచీలోని ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇదే నగరంలో సుమారు 25 మందిని కరిచిన ఓ శునకం మరణించింది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసినప్పటినుంచి పాకిస్థాన్.. ఇండియా మీద అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ ఆర్టికల్ రద్దు విషయంలో భారత వైఖరిని అర్థం చేసుకున్న చైనా కూడా పరోక్షంగా కేంద్రం చర్యకు మద్దతునిస్తున్నట్టు పాక్ కు యాంటీ-రేబీస్ వ్యాక్సీన్ సరఫరాను నిలిపివేసినట్టు కనిపిస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu