దావూద్ ఇబ్రహీం కరాచీలో లేడు, పాకిస్తాన్ డబుల్ టాక్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలో లేడని పాకిస్తాన్ ప్రకటించింది. అసలు దావూద్ గానీ మసూద్ అజహర్, హాఫిజ్ సయీద్ వంటి ఉగ్రవాదులు గానీ తమ దేశంలో లేరని వెల్లడించింది. వీరి ఆస్తులను స్వాధీనం..

దావూద్ ఇబ్రహీం కరాచీలో లేడు, పాకిస్తాన్ డబుల్ టాక్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 23, 2020 | 10:18 AM

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కరాచీలో లేడని పాకిస్తాన్ ప్రకటించింది. అసలు దావూద్ గానీ మసూద్ అజహర్, హాఫిజ్ సయీద్ వంటి ఉగ్రవాదులు గానీ తమ దేశంలో లేరని వెల్లడించింది. వీరి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నామని, వీరి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నామని, మొత్తం 88 ఉగ్రవాద బృందాలను బ్యాన్ చేస్తున్నామని పాక్ ప్రభుత్వం నిన్న ఆర్భాటంగా ప్రకటించింది. అయితే ఈ వార్తలన్నీ డొల్లే అని తేలిపోయింది. వీరు తమ దేశంలోనే ఉన్నారంటూ మీడియాలోని కొన్ని వర్గాల్లో వఛ్చిన వార్తలు నిరాధారమైనవని ప్రభుత్వం ట్వీట్ చేసింది. అధికారికంగా స్పష్టం చేసింది. తాము కేవలం ఐరాస భద్రతామండలి స్టాట్యూటరీ నోటిఫికేషన్లను మాత్రమే ‘రీప్రొడ్యూస్’ చేశామని పేర్కొంది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ వార్తలకు ఆధారం లేదని కొట్టి పారేసింది.

కేవలం ఒక్కరోజులో పాక్ డబుల్ టాక్ అసలు ‘నిజాన్ని’ కక్కింది. అసలు నిన్ననే పాకిస్థాన్ చేసిన ప్రకటనలను విశ్లేషకులు విశ్వసించలేదు కూడా, తమకు చైనా వత్తాసు ఉన్నంతకాలం ఆ దేశం ఇలాగే ప్రవర్తిస్తుందని అంటున్నారు.