రామమందిర శంకుస్థాపనతో సంబరపడుతున్న పాక్‌ క్రికెటర్‌!

రామమందిర శంకుస్థాపనతో సంబరపడుతున్న  పాక్‌ క్రికెటర్‌!

జగన్మోహనుడైన శ్రీరాముడి అసలైన అందం ఆయన వ్యక్తత్వమేనని అంటున్నాడు పాకిస్తాన్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా.. చెడుపై మంచి విజయం సాధిస్తుందనడానికి రాముడో సూచికని, అయోధ్యలో రామమందిరానికి భూమి పూజ జగరడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఆనందిస్తున్నారని కనేరియా అన్నాడు.

Balu

|

Aug 06, 2020 | 1:02 PM

జగన్మోహనుడైన శ్రీరాముడి అసలైన అందం ఆయన వ్యక్తత్వమేనని అంటున్నాడు పాకిస్తాన్‌ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా.. చెడుపై మంచి విజయం సాధిస్తుందనడానికి రాముడో సూచికని, అయోధ్యలో రామమందిరానికి భూమి పూజ జగరడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో ఆనందిస్తున్నారని కనేరియా అన్నాడు. హిందువులకు ఇదో చారిత్రక ఘట్టమని, రాముడు అందరికీ ఆదర్శప్రాయుడని ట్విట్టర్‌లో తన భావనను తెలిపాడు. రాముడి జీవితం నుంచి ఎన్నో మంచి విషయాలను నేర్చుకోవచ్చని వివరించాడు కనేరియా. రామమందిరానికి భూమి పూప జరగడం ఆత్మ సంతృప్తిని కలిగించిందన్నాడు. పాపం కనేరియా చాలా కాలం నుంచి తనపై విధించిన జీవతకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డును అభ్యర్థిస్తూ వస్తున్నాడు.. హిందువును కాబట్టే పాక్‌ బోర్డు తనకు మద్దతు ఇవ్వడం లేదని వాపోయాడు కూడా! పైగా మొన్నీమధ్యనే ఓ ఆటగాడి మూడేళ్ల నిషేధాన్ని సగానికి సగం తగ్గించింది.. కనేరియా విషయానికి వచ్చేసరికి తమ చేతుల్లో ఏమీ లేదని, అతడిని నిషేధాన్ని విధించింది ఇంగ్లాండ్‌లోని వేల్స్‌ క్రికెట్‌ బోర్డని తప్పించుకుంటోంది..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu