కుల్ భూషణ్ జాదవ్‌కు న్యాయవాది ఏర్పాటుకు భారత్‍ డిమాండ్

సైనిక కోర్టు ఆదేశించిన మరణశిక్షను రివ్యూ చేయ‌డానికి పాకిస్థాన్‌ను కోరిన ఇంట‌ర్నేష‌న‌ల్ న్యాయ‌ స్థానం(ఐసీజే) ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపింది.

కుల్ భూషణ్ జాదవ్‌కు న్యాయవాది ఏర్పాటుకు భారత్‍ డిమాండ్
Follow us

|

Updated on: Aug 08, 2020 | 10:26 PM

సైనిక కోర్టు ఆదేశించిన మరణశిక్షను రివ్యూ చేయ‌డానికి పాకిస్థాన్‌ను కోరిన ఇంట‌ర్నేష‌న‌ల్ న్యాయ‌ స్థానం(ఐసీజే) ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపింది. జాదవ్‌కు ఉపశమనం కలిగించేందుకే సీక్రెట్‌గా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారన్న ఆరోపణలను న్యాయ మంత్రిత్వ శాఖ ఐసీజే తీవ్రంగా ఖండించింది. ఆదేశాలకు అనుగుణంగానే తమ ప్ర‌భుత్వం త‌దుప‌రి చర్యలు తీసుకుంటోందని వివ‌రించింది.

ఇక మాజీ మాజీ నేవీ ఆఫిస‌ర్ అయిన జాదవ్‌కు న్యాయ ప్రతినిధిని నియమించేలా ఇండియాకు అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ ఉన్నత న్యాయ‌స్థానం సూచించిన నేపథ్యంలో న్యాయ సలహాదారుడిని పాకిస్థాన్ పంపేందుుక ఇండియా గ‌వ‌ర్న‌మెంట్ చర్యలు తీసుకుంటోంది.

తమ కంట్రీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇండియా నిఘా ఏజెంట్ అంటూ కుల్ భూషణ్ జాదవ్‌ను పాకిస్థాన్ అరెస్ట్ చేసిన విషయం అంద‌రికీ తెలిసిందే. అంతేగాక, పాక్ మిలిటరీ కోర్టు అతనికి మరణశిక్ష ఖ‌రారు చేసింది. దీంతో ఇంట‌ర్నేష‌న‌ల్ కోర్టును ఆశ్రయించింది ఇండియా. ఈ క్రమంలో ఐసీజే జోక్యంతో జాదవ్ మరణ శిక్ష నిలిచిపోయింది.