పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమ పునరుధ్ధరణకు పాకిస్తాన్ ఐఎస్ఐ యత్నం, ఇదే సమయమని కుట్ర !

పంజాబ్ లో ఖలిస్థాన్ ఉద్యమాన్ని పునరుధ్దరించేందుకు పాకిస్తాన్ లోని ఇంటర్ సర్వీసెస్ ఏజన్సీ ( ఐఎస్ఐ) కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలద్వారా తెలుస్తోంది. ఇందుకోసం మృతుడైన ఖలిస్థాన్ టెర్రరిస్ట్..

పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమ పునరుధ్ధరణకు పాకిస్తాన్ ఐఎస్ఐ యత్నం, ఇదే సమయమని కుట్ర !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 08, 2020 | 4:01 PM

పంజాబ్ లో ఖలిస్థాన్ ఉద్యమాన్ని పునరుధ్దరించేందుకు పాకిస్తాన్ లోని ఇంటర్ సర్వీసెస్ ఏజన్సీ ( ఐఎస్ఐ) కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలద్వారా తెలుస్తోంది. ఇందుకోసం మృతుడైన ఖలిస్థాన్ టెర్రరిస్ట్ జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే మేనల్లుడు  లఖ్ బీర్ సింగ్ రోడేను వినియోగించుకోజూస్తోందని తెలిసింది. లఖ్ బీర్ సింగ్ అకల్ తఖ్త్ జతేదార్ జస్బీ సింగ్ రోడే సోదరుడు కూడా..పంజాబ్ లో లోగడ ఆపరేషన్ బ్లూ స్టార్ సందర్భంగా భద్రతా దళాలు జర్నైల్ సింగ్ భింద్రన్ వాలేను మట్టు బెట్టాయి. గత ఏడాది కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ను ప్రారంభించినప్పటి నుంచి పాక్ లోను, విదేశాల్లోనూ గల ఖలిస్థాన్ అనుకూల సంస్థలు చురుకుగా వ్యవహరించడం మొదలైంది.

ఇండియాలో, ముఖ్యంగా పంజాబ్ లో ఖలిస్థాన్ ఉద్యమాన్ని పునరుధ్దరించేందుకు ఈ సంస్థ నాయకుడు గోపాల్ సింగ్ బార్బా, గుర్ జిత్ సింగ్ ఛీమా , మరికొందరు ఇండియాకు ప్రమాదకర వ్యక్తులుగా మారారని గుర్తించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా పంజాబ్ అంతటా గల హిందూ అనుకూల వాదులను టార్గెట్లుగా ఎంచుకునేందుకు పాక్ ఐ ఎస్ ఐ కుట్ర పన్నుతోందట. ఈ సంస్థకు, ఖలిస్థాన్ ఉగ్రవాదులకు మధ్య దుబాయ్ లోని ఓ గ్యాంగ్ స్టర్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. బహుశా రైతుల ఆందోళన నేపథ్యంలో పాక్ ఐ ఎస్ ఐ తిరిగి ఈ రాష్ట్రంలో ఖలిస్థాన్ నినాదాన్ని రెచ్ఛగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాల కథనం.