పాక్‌ ఆర్మీకి ఎదురుదెబ్బ.. మేజర్‌తో పాటు ఆరుగురు జవాన్లు మృతి..

పాక్‌ ఆర్మీకి ఎదురుదెబ్బ.. మేజర్‌తో పాటు ఆరుగురు జవాన్లు మృతి..

పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. పాక్ – ఇరాన్ సరిహద్దుల్లో జరిగిన ఐఈడీ బ్లాస్ట్‌లో ఆర్మీ మేజర్‌తోపాటుగా.. మరో ఆరుగురు పాకిస్థాన్ జవాన్లు చనిపోయారు. పాక్-ఇరాన్‌కు సరిహద్దుకు 14 కిలో మీటర్ల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే పాక్ జవాన్లపై దాడికి దిగింది మరెవరో కాదు. బలుచిస్థాన్ వేర్పాటు వాదులే. గత కొన్నేళ్లుగా బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పాక్‌తో తమకు ప్రత్యేక దేశం కావాలంటే పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం పాకిస్థాన్‌కు చెందిన […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 09, 2020 | 11:13 AM

పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. పాక్ – ఇరాన్ సరిహద్దుల్లో జరిగిన ఐఈడీ బ్లాస్ట్‌లో ఆర్మీ మేజర్‌తోపాటుగా.. మరో ఆరుగురు పాకిస్థాన్ జవాన్లు చనిపోయారు. పాక్-ఇరాన్‌కు సరిహద్దుకు 14 కిలో మీటర్ల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే పాక్ జవాన్లపై దాడికి దిగింది మరెవరో కాదు. బలుచిస్థాన్ వేర్పాటు వాదులే. గత కొన్నేళ్లుగా బలుచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. పాక్‌తో తమకు ప్రత్యేక దేశం కావాలంటే పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం పాకిస్థాన్‌కు చెందిన మిలటరీ వాహనాన్ని పేల్చేశారు. ఐఈడీ మందుపాతరలను పెట్టి.. రిమోట్ కంట్రోల్ సహాయంతో పేల్చేయడంతో.. వాహనంలో ఉన్న ఆర్మీ మేజర్‌ నదీం అబ్బాస్‌తో పాటుగా.. ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ దాడి చేసింది మేమేనంటూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu