శ్రీశైల క్షేత్రంలో అన్యమత ప్రచారం.. పోలీసుల అదుపులో నలుగురు!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. శ్రీశైలంలోని రుద్రపార్క్‌లో బైబిల్ పఠనం చేస్తున్నారని తెలియడంతో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది రుద్రపార్క్ వద్దకు వెళ్లారు. అక్కడ బైబిల్ పఠనం చేస్తున్న నలుగురిని గుర్తించారు. ఇది గమనించిన ఆ నలుగురు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వారిని నిలువరించి బ్యాగులను తనిఖీ చేశారు. బ్యాగుల్లో అన్యమత గ్రంథాలు లభించడంతో వారిని పోలీసులకు అప్పగించారు. ఆలయ పరిసరాల్లో అన్యమత ప్రచారం నేరం. […]

శ్రీశైల క్షేత్రంలో అన్యమత ప్రచారం.. పోలీసుల అదుపులో నలుగురు!

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. శ్రీశైలంలోని రుద్రపార్క్‌లో బైబిల్ పఠనం చేస్తున్నారని తెలియడంతో ఆలయ సెక్యూరిటీ సిబ్బంది రుద్రపార్క్ వద్దకు వెళ్లారు. అక్కడ బైబిల్ పఠనం చేస్తున్న నలుగురిని గుర్తించారు. ఇది గమనించిన ఆ నలుగురు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వారిని నిలువరించి బ్యాగులను తనిఖీ చేశారు. బ్యాగుల్లో అన్యమత గ్రంథాలు లభించడంతో వారిని పోలీసులకు అప్పగించారు.

ఆలయ పరిసరాల్లో అన్యమత ప్రచారం నేరం. శ్రీశైల క్షేత్రంలో నిబంధనలు ఉల్లంఘించి అన్యమత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడంలో శ్రీశైలం అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu