యాంటీ బయోటిక్స్‌ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని ‘సూపర్ గనేరియా’ వ్యాధి వస్తుందట

మాయదారి కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్ సమయంలో యాంటీ బయోటిక్స్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపాటి జ్వరం వచ్చినా కూడా...

యాంటీ బయోటిక్స్‌ అతిగా వాడుతున్నారా.! అయితే, యమ డేంజర్.. చికిత్సలేని 'సూపర్ గనేరియా' వ్యాధి వస్తుందట
Ravi Kiran

|

Dec 23, 2020 | 1:00 PM

Super Gonorrhea Disease: మాయదారి కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్ సమయంలో యాంటీ బయోటిక్స్‌ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నపాటి జ్వరం వచ్చినా కూడా కరోనా లక్షణాలు వచ్చాయేమోనన్న భయంతో ప్రజలు యాంటీ బయోటిక్స్‌ను విచ్చలవిడిగా తీసుకున్నారు. అయితే ఇలా యాంటీ బయోటిక్స్ అధికంగా తీసుకోవడం వల్ల ”సూపర్ గనేరియా’ అనే చికిత్స లేని వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.

ఇప్పటిదాకా కరోనా వైరస్‌పై యాంటీ బయోటిక్స్ ఎలాంటి ప్రభావం చూపించలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి ఒకరు తెలిపారు. మార్చి-ఏప్రిల్ మధ్యకాలంలో అమెరికాలోని సుమారు 70 శాతం కరోనా రోగులకు అధిక శాతంలో యాంటీ బయోటిక్స్ ఇచ్చారని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఓ అధ్యయనంలో పేర్కొంది. శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అజిత్రోమైసిన్‌ను అధిక మోతాదులో ఇచ్చినట్లు అందులో తెలిపింది.

యాంటీ బయోటిక్‌లను అధిక శాతంలో వాడటం వల్ల ఎక్కువగా రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లు వస్తాయని.. ‘సూపర్ గనేరియా’ అనే లైంగిక సంక్రమణ ఇన్ఫెక్షన్ ప్రబలే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స లేదని.. కాబట్టి యాంటీ బయోటిక్స్‌ను అవసరమైతే తప్ప తీసుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!

ఆన్‌లైన్‌ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu